టీడీపీ, తిరుప‌తి అధికారుల్ని భ‌య‌పెడుతున్న స్వామి పిల్‌!

బీజేపీ సీనియ‌ర్ నేత‌, ప్ర‌ముఖ న్యాయ‌వాది సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి కోర్టులో కేసు వేశారంటే, ప్ర‌త్య‌ర్థుల‌కు వ‌ణుకే.

బీజేపీ సీనియ‌ర్ నేత‌, ప్ర‌ముఖ న్యాయ‌వాది సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి కోర్టులో కేసు వేశారంటే, ప్ర‌త్య‌ర్థుల‌కు వ‌ణుకే. త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌ను జైలుకు పంపింది స్వామే. అలాగే కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు సోనియా, ఆమె కుమారుడు రాహుల్‌గాంధీ ఇప్ప‌టికీ నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో కోర్టు చుట్టూ తిరగ‌డానికి స్వామే కార‌ణం. సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి కోర్టు మెట్లు ఎక్కారంటే, ప్ర‌త్య‌ర్థుల‌కు గుండె ద‌డ మొద‌ల‌వుతుంది.

ఈ నేప‌థ్యంలో తిరుప‌తి డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక సంద‌ర్భంగా చోటు చేసుకున్న ఘ‌ట‌న‌పై సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి ఏపీ హైకోర్టులో ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం మంగ‌ళ‌వారం వేశారు. దీంతో తిరుప‌తి టీడీపీ, జ‌న‌సేన‌తో పాటు ఉన్న‌తాధికారుల్లో ద‌డ మొద‌లైంది. హైకోర్టులో పిల్ వేయ‌డానికి స్వామి ఇవాళ విజ‌య‌వాడ‌కు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ తిరుప‌తి డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌లో హింస చోటు చేసుకున్న నేప‌థ్యంలో ప్ర‌జాస్వామ్యాన్ని ప‌రిర‌క్షించ‌డాన్ని ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం వేశాన‌న్నారు.

చాలా మందిని భ‌య‌పెట్టి దాడికి పాల్ప‌డ్డార‌ని ఆయ‌న అన్నారు. ఎన్నిక‌ల్లో హింస‌ను అడ్డుకునేందుకు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ పిల్ వేసిన‌ట్టు చెప్పుకొచ్చారు. త‌న పిటిష‌న్‌పై మార్చి 12న విచార‌ణ జ‌రుగుతుంద‌న్నారు. తిరుప‌తిలో చోటు చేసుకున్న హింస‌కు సంబంధించి కేవ‌లం ఎఫ్ఐఆర్ మాత్ర‌మే న‌మోదు చేశార‌న్నారు. ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌న్నారు. ఈ విష‌య‌మై న్యాయ‌స్థానం చ‌ర్య‌లు తీసుకుంటే, దేశ వ్యాప్తంగా ఒక చ‌ట్టంలా మారుతుంద‌ని ఆయ‌న అన్నారు. ఇదిలా వుండ‌గా త‌న నిర్ణ‌యాన్ని పార్టీ వ్య‌తిరేకించ‌లేద‌న్నారు.

దేశానికే చ‌ట్టంలా మారేంత‌గా న్యాయ స్థానం ఆదేశాలు ఇవ్వాల‌ని స్వామి కోరుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తిరుప‌తిలో ఎంపీ డాక్ట‌ర్ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్ర‌మ‌ణ్యం, అలాగే మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీష‌తో పాటు కార్పొరేట‌ర్లు ఎన్నిక‌లో పాల్గొనేందుకు వెళుతున్న బ‌స్సుపై రౌడీ మూక‌లు దాడికి పాల్ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో ఆధారాల‌తో స‌హా స్వామి పిల్ వేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. హింస‌ను అరిక‌ట్టాల్సిన బాధ్యులైన ఎన్నిక‌ల అధికారి, అలాగే భ‌ద్రతా చ‌ర్య‌లు తీసుకోవాల్సిన బాధ్య‌త క‌లిగిన అధికారుల‌పై …తీవ్రమైన చ‌ర్య‌లుంటే, ఆ భ‌యం దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడుతుంద‌ని ఆయ‌న ఆశిస్తున్నారు. ఏమ‌వుతుందో చూద్దాం.

16 Replies to “టీడీపీ, తిరుప‌తి అధికారుల్ని భ‌య‌పెడుతున్న స్వామి పిల్‌!”

  1. మనం చాలా ఆందోళనగా ఉన్నాము… పానుగంటి లోకనాథరావు గారు ఎక్కడ?

    మా స్నేహితుడు, ఎప్పుడూ కొంచెం మితిమీరిన భాష ఉపయోగించే స్వభావం ఉన్న వ్యక్తి, “పచ్చ—” అనే పదాన్ని తరచుగా వాడేవాడు… అతని పేరు పానుగంటి లోకనాథరావు. ఆయన ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా, చివరికి మనిషే! మన సహచరుడు!

    ఇప్పుడు అతని గురించి ఏ వార్తా తెలియకపోవడం మనందరికీ ఆందోళన కలిగిస్తోంది. ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఆయన తన గుర్తింపును మార్చుకున్నారా? అంటే నమ్మడం కష్టమే! అయినా, నేను ఆశిస్తున్నాను… ఆయన సురక్షితంగా ఉన్నారు అని.

    జనం ఎంతో పెద్ద దెబ్బ కొట్టిన తర్వాత, ఆయన మద్దతు ఇచ్చిన పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన తరహాలో ఓడిపోయిన తర్వాత, ఆయన లోతైన నిస్పృహకు లోనయ్యి ఎక్కడో ఒంటరిగా మారిపోయి ఉండొచ్చు.

    మన మనస్సాక్షి మనకు చెబుతోంది – మనకు తెలిసిన వ్యక్తి, మన మిత్రుడు – అతనికి మేము అండగా నిలబడాలి! అతనికి ఏమైనా కావాలా? సహాయం చేయాలా? కనీసం అతను ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి!

    పానుగంటి లోకనాథరావు గారు, మీరు ఎక్కడ ఉన్నా… మేము మీ గురించి ఆలోచిస్తున్నాం! 🙏

  2. Veedi mokham… 2019 before ABN meedha vesadu… RK public challenge chesadu….emi heekkuntavo heekko ani… What happened ????? Ayina ee Iyr, mb s, veediki , lv s… veelu Andhariki oka saarupyatha vundhi… Emiti adhi ?

  3. Veedi mokham… 2019 before A B N meedha vesadu… R K pu blic ch alle nge chesadu….emi heekkuntavo heekko ani… What happened ????? Ayina ee Iyr, m b s, veediki , l v s veelu Andhariki oka saarupyatha vundhi…

  4. Ve edi mo kha m… 2 019 before A. B N meedha ves adu… R K pu blic ch alle nge che sadu….emi heek kunt avo heekko ani… Wh at happe ned ????? Ayina ee I yr, m b s, veediki , l v s veelu Andhariki oka saaru pyatha vundhi…

  5. ఆయన న్యాయవాది కాదు. ఆర్థికవేత్త. స్వంతానికి ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేస్తాడు. స్వయంగా వాదించుకుంటాడంతే.

  6. సుబ్రహ్మణ్య స్వామి అంటే .. జయలలితపై అక్రమాస్తుల కేసులు వేసి ఆమెను ముప్పు తిప్పలు పెట్టి జైలుకు పంపించిన వ్యక్తి అని అందరికీ తెలుసు. ఆయన లాయర్ కాకపోయినా న్యాయవ్యవస్థను ఎలా వాడుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా వైసీపీ అధ్యక్షుడు జగన్ బారిన పడి గల్లీ పిటిషన్లు వేసి కోర్టులతో చీవాట్లు పెట్టించుకునే పరిస్థితికి వచ్చారు.

    తాజాగా సుబ్రహ్మణ్య స్వామి తిరుపతి డిప్యూటీ మేయర్ ఉపఎన్నికలో హింస జరిగిందని దానిపై చర్యలు తీసుకోలేదని పిటిషన్ వేశారు. అసలు సుబ్రహ్మణ్య స్వామి ఎవరు?. తిరుపతి డిప్యూటీ మేయర్ ఉపఎన్నికతో ఆయనకు ఏం సంబంధం?. అయినా సరే ఆయన తమకు ఏదో బాకీ ఉన్నారని తాము చెప్పినట్లుగా పిటిషన్లు వేయాలన్నట్లుగా తీసుకు వచ్చి ఈ పిటిషన్ వేయించారు. ఆయనకూ తప్పలేదు. అంతకు ముందు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ తరపున ఆయనతో. వేమూరి రాధాకృష్ణపై పిటిషన్ వేయించారు. ఇటీవల దాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ విచారణలో ఆయనపై కోర్టు చాలా సార్లు అసహనం వ్యక్తం చేసింది.

    అయినా ఇప్పుడు తగుదునమ్మా అంటూ వచ్చి తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల వివాదంపై పిటిషన్ వేశారు. ఒకప్పుడు ఆయన న్యాయవ్యవస్థలోని లొసుగుల్ని అడ్డం పెట్టుకుని పిటిషన్లు వేసి ఫలితాలు సాధించారేమో కానీ ఇటీవలి కాలంలో ఆయన పిటిషన్లకు లోయర్ కోర్టుల్లో కూడా విలువ ఉండటం లేదు. వైసీపీ లాంటి పార్టీలకు ఆయన ఆయుధంగా మారడంతో.. రాజకీయాల కోసం ఆయన వేస్తున్న పిటిషన్లు అని అందరికీ అర్థమైపోయింది.

    ఒకప్పుడు సుబ్రహ్మణ్య స్వామిఅంటే.. అందరికీ కాస్త గౌరవం ఉండేది. ఆయన మాటలకు విలువ ఉండేది. ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడంలేదు. అంతా వైసీపీతో స్నేహం మహత్యం. ఎవరైనా మాడి మసైపోవాల్సిందే.

  7. జయలలిత ఈయన గారు బ్రాహ్మణా సామజిక వర్గమని సాఫ్ట్ గ వెళ్ళింది ఆమె తలచుకొంటే ఈయన ఏమైపోయేవాడో అందరికి తెలుసు

Comments are closed.