లోక ర‌క్ష‌కా.. భ‌క్తుల‌కు ఎందుకీ శిక్ష‌?

ఇంకెంత కాలం ఇలా టీటీడీకి సంబంధించి విన‌కూడ‌ని, చూడ‌కూడ‌న‌వి చూడాల‌నే ప్ర‌శ్నించే భ‌క్తులు కోట్లాది మంది ఉన్నారు

తిరుమ‌ల శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి లోక‌ర‌క్ష‌కుడిగా పూజ‌లందుకుంటున్నారు. అలాంటి లోక ర‌క్ష‌కుడిని ద‌ర్శించుకోవాల‌ని ప‌రిత‌పించే భ‌క్తుల‌కు శిక్ష ఏంట‌నే ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా టీటీడీ వివాదాల‌కు కేంద్రం కావ‌డం హిందూ భ‌క్తుల మ‌నోభావాల్ని దెబ్బ తీస్తోంది. కొద్ది కాలం వ్య‌వ‌ధిలో టీటీడీలో అప‌చారాలు చోటు చేసుకోవ‌డం హిందువుల మ‌న‌సుల్ని క‌ల‌చివేస్తోంది.

తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదాన్ని పంది కొవ్వు, ఆవు కొవ్వుతో త‌యారు చేశార‌నే ఆరోప‌ణ‌ల‌తో మొద‌లు, ఆ త‌ర్వాత అనేక దుష్ప‌రిణామాలు టీటీడీలో సంభ‌వించాయి. అస‌లు టీటీడీలో ఎందుకిలా జ‌రుగుతోంద‌ని భ‌క్తులు ఆవేద‌న‌తో ప్ర‌శ్నించ‌ని రోజు ఉండ‌దంటే అతిశ‌యోక్తి కాదు. ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది హిందూ భ‌క్తులు అత్యంత ప‌విత్రంగా భావించే ల‌డ్డూ ప్ర‌సాదం క‌ల్తీ ఆరోప‌ణ‌లు జీర్ణించుకోలేకున్నాయి.

సుప్రీంకోర్టు చీవాట్ల‌తో ఎంతోకొంత భ‌క్తుల‌కు ఉప‌శ‌మనం ల‌భించింది. లేదంటే, మ‌న‌సులోనే కుమిలిపోయే వారు. క‌ల్తీ జ‌రిగింద‌నేందుకు ఆధారాలేవీ అని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ప్ర‌శ్నించ‌డంతో పాటు రాజ్యాంగ ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తులు బాధ్య‌తారాహిత్యంగా మాట్లాడ్డం ఏంట‌ని చీవాట్లు పెట్టింది. క‌ల్తీ ఆరోప‌ణ‌ల‌పై సీబీఐ నేతృత్వంలో విచార‌ణ క‌మిటీని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగ‌తి తెలిసిందే.

ఆ త‌ర్వాత వైకుంఠ ద్వార ద‌ర్శ‌న టికెట్ల జారీ సంద‌ర్భంగా తిరుప‌తిలో తొక్కిస‌లాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఐదారుగురు ప్రాణాలు కోల్పోవ‌డంతో పాటు ప‌దుల సంఖ్య‌లో గాయాల‌పాల‌య్యారు. గ‌తంలో ఎప్పుడూ ఇలాంటి దుర్ఘ‌ట‌న‌లో చోటు చేసుకోక‌పోవ‌డంతో ప్ర‌పంచ వ్యాప్తంగా హిందూ భ‌క్తులంతా ఉలిక్కిప‌డ్డారు. ఈ దుర్ఘ‌ట‌న‌పై స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించ‌డానికి తిరుప‌తి వెళ్లిన సీఎం చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీటీడీ బోర్డు చైర్మ‌న్ బీఆర్ నాయుడు, అలాగే ఈవో శ్యామ‌లారావు మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంద‌నే వార్త‌ల‌తో అత్యున్న‌త ఆధ్మాత్మిక వ్య‌వ‌స్థ‌లో స‌మ‌న్వ‌య లోపం వుంద‌ని లోకానికి తెలిసొచ్చింది.

ఆ త‌ర్వాత తిరుమ‌ల‌లో ల‌డ్డూ ప్ర‌సాదం త‌యారీ కేంద్రంలో అగ్ని ప్ర‌మాదం, అలాగే క‌డ‌ప‌కు చెందిన మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ వ‌స‌తి స‌ముదాయంపై నుంచి ప‌డి ప్రాణాలు కోల్పోవ‌డం భ‌క్తుల్ని ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. అలాగే వారం క్రితం సాక్ష్యాత్తు శ్రీ‌వారి క‌ళ్లెదుటే ఆల‌యంలో చిరు ఉద్యోగి బాలాజీపై బోర్డు స‌భ్యుడు న‌రేశ్‌కుమార్ రాయ‌లేని భాష‌లో దూషించ‌డం భ‌క్తుల మ‌నోభావాల్ని దెబ్బ‌తీసింది.

బోర్డు స‌భ్యుడి వైఖ‌రికి నిర‌స‌న‌గా టీటీడీ ఉద్యోగులు తిరుప‌తిలో ప‌రిపాల‌న భ‌వ‌నం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళ‌న నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత న‌ల్ల బ్యాడ్జీల‌తో నిర‌స‌న గురించి తెలిసిందే. నాలుగు గోడ‌ల మ‌ధ్య ఉద్యోగితో ఏం మాట్లాడారో తెలియ‌దు కానీ, క్ష‌మాప‌ణ చెప్పార‌ని రాజీ కుదిర్చారు.

తాజాగా త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌దానం స‌త్రంలో బెంగ‌ళూరుకు చెందిన యువ‌కుడు మంజునాథ్ తీవ్రంగా గాయ‌ప‌డి, ప్రాణాలు కోల్పోయిన‌ట్లు వార్త‌లు రావండంతో.. అస‌లు టీటీడీలో ఎందుకు ఇన్ని అప‌చారాలు జ‌రుగుతున్నాయ్‌? దేవుడు త‌మ‌ను ఎందుకు శిక్షిస్తున్నార‌ని భ‌క్తులు ఆవేద‌న చెందుతున్నారు.

ఇన్ని జ‌రుగుతున్న‌ స‌నాత‌న ధ‌ర్మం గురించి ప్ర‌వ‌చించే ప్ర‌భుత్వ పెద్ద‌లు, అలాగే టీటీడీ పాల‌క మండ‌లి చైర్మ‌న్‌, స‌భ్యులు, ఉన్న‌తాధికారులు ఏం చేస్తున్నార‌నే ప్ర‌శ్న భ‌క్తుల నుండి ఉద‌యిస్తోంది. ఇంకెంత కాలం ఇలా టీటీడీకి సంబంధించి విన‌కూడ‌ని, చూడ‌కూడ‌న‌వి చూడాల‌నే ప్ర‌శ్నించే భ‌క్తులు కోట్లాది మంది ఉన్నారు. ఇంత వ‌ర‌కూ జ‌రిగిన ఘోరాలు, నేరాలు చాలు. ఇక‌పై టీటీడీలో ఇలాంటివి పున‌రావృతం కాకుండా ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకోవాల‌ని శ్రీవారి భ‌క్తులు కోరుతున్నారు.

11 Replies to “లోక ర‌క్ష‌కా.. భ‌క్తుల‌కు ఎందుకీ శిక్ష‌?”

  1. మనం ఎంతో ఆందోళనగా ఉన్నాం… మా మిత్రుడు పానుగంటి లోకనాథరావు గారు ఎక్కడ?

    అతను మా స్నేహితుడు. కొంత ఘాటుగా మాట్లాడే స్వభావం ఉన్నా, మేమంతా గుండెతో ప్రేమించిన మనిషి. “పచ్చ—” అనే పదాన్ని తరచుగా ఉపయోగించే అతని ఉత్సాహాన్ని మేం చూసాం, వినాం. కానీ ఇప్పుడు? అతని జాడే లేదు!

    ఏ పార్టీని మద్దతు ఇచ్చినా, చివరికి అతను మనిషే! మనకంటూ ఓపిక ఉన్నంతవరకు, మన సహచరుడిని విస్మరించలేం! అతను ఎక్కడ? ఏం జరిగింది?

    అతను తన గుర్తింపును మార్చుకున్నాడా? ఎక్కడో అంతర్ముఖంగా మారిపోయాడా? ఏమయినా కావొచ్చు… కానీ నాకు ఒక అనుమానం ఉంది. ప్రజలు అతను నమ్మిన పార్టీకి అద్భుతమైన కర్రెక్కు ఝలిపించిన తర్వాత, అతను లోతైన నిరాశలోకి జారిపోయి ఉంటాడు. ఆ ఒక్క విషయం అతన్ని పూర్తిగా మౌనంలోకి నెట్టివేసి ఉంటుందా? అతను తన ప్రపంచాన్ని మూసేసుకున్నాడా?

    కానీ మనం అలా ఊరుకోలేం! ఒక మనిషిగా, ఒక మిత్రుడిగా అతనిని వెతకాలి! కనీసం అతను బాగానే ఉన్నాడో? ఓదార్పు కావాలా? అని తెలుసుకోవాలి. మనం విభేదించవచ్చు, వాదించవచ్చు… కానీ ఒక మనిషి తన నీడను కూడా కోల్పోయేలా చేసిపారేయడం మన ధర్మం కాదు!

    పానుగంటి లోకనాథరావు గారు, మీరు ఎక్కడ ఉన్నా… మేము మిమ్మల్ని మర్చిపోలేం. మీ ఆరోగ్యం, మీ మనసు శాంతిగా ఉందా? ఏమైనా సహాయం కావాలా? ఓ మాట చెప్పండి. మేమందరం మీతో ఉన్నాం. 🙏

  2. ఒక క్రిస్టియన్ పాలన మేము బాగున్నా ఒప్పుకొము.. మమ్మల్ని మేము పాలించుకోగలం

  3. Orey convertef gorrebidda GA.

    Neekenduku ra Tirumala gurinchi.

    Nee devathalu YA-R gaadi family.

    Vaallu entha naasanam chesaru Tirumala ni.

    Appuu eni chesavu?

Comments are closed.