తిరుమల అన్నదానంలో యువకుడి మృతి!

అన్నదాన సత్రంలోనే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయినట్టు యువకుడి కుటుంబ సభ్యులు మీడియాకు చెప్పడం గమనార్హం.

తిరుమల తరిగొండ వెంగమాంబ అన్నదానంలో మూడు రోజుల క్రితం దారుణం చోటు చేసుకుంది. కర్ణాటకకు చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. యువకుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదన వర్ణనాతీతం. అయితే ఈ ఘటన గురించి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, బాధితుల వేదన కట్టలు తెంచుకుంది. బాధితులు చెప్పిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

బెంగ‌ళూరుకు చెందిన 12 మంది కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి మెజిస్టిక్ బస్టాండ్ నుంచి బయల్దేరి, శనివారం ఉదయం తిరుమల చేరుకున్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం తరిగొండ వెంగమాంబ అన్నదాన కేంద్రానికి వెళ్లారు. అన్నప్రసాదం స్వీకరించడానికి రెడీ అయ్యారు.

అన్నదాన కేంద్రంలో నాలుగో నంబర్ హాల్ వద్ద గేట్  వ‌ద్ద‌ బెంగ‌ళూరుకు చెందిన నాగరత్నమ్మ, మల్లేష్ దంపతుల కుమారుడు మంజునాథ్ (16) అనే యువకుడు కిందపడి.. స్పృహ కోల్పోయాడు. వెంటనే అతన్ని రుయా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సమీపంలోని స్విమ్స్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మంజునాథ్ తుదిశ్వాస విడిచాడు.

దీంతో బాలుడి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది.

అన్నదాన సత్రంలోనే ప్రాణాలు పోయాయి.

అన్నదాన సత్రంలోనే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయినట్టు యువకుడి కుటుంబ సభ్యులు మీడియాకు చెప్పడం గమనార్హం. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లి సీపీఆర్ చేశారన్నారు. టీటీడీలో వరుస దుర్ఘటనలపై భక్తుల నుంచి తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఈ దుర్ఘటనపై ప్రభుత్వం, టీటీడీ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో చూడాలి.

12 Replies to “తిరుమల అన్నదానంలో యువకుడి మృతి!”

  1. దురదృష్టకరం.

    దీనికి చంద్ర బాబు నాయు do, B R naido , PK Naido ఎవరో oka naidu serious ga theesukuni inko sari ఇలాంటివి jaraga కుండా చూడాలి

  2. What is happening within TTD? Having such incidents part of sanathana dharmam? Emotional or passionate speeches made about religion and protecting religion will have no value without follow-up actions in meeting such tall promises.

  3. పానుగంటి లోకనాథరావు గారు… మీరు ఎక్కడ?

    అప్పుడప్పుడూ మితిమీరిన భాష వాడినా, మనమంతా నవ్వుకుంటూ భరించుకున్న మన మిత్రుడు, “పచ్చ—” అనే పదాన్ని మంత్రం లాగా ఉచ్ఛరిస్తూ ఉండే పానుగంటి లోకనాథరావు గారు… ఎక్కడ బండి తిప్పేశారు?

    ఏ పార్టీని మద్దతు ఇచ్చినా, చివరికి మనిషే కదా! మన fellow human being! కానీ, ఇప్పుడు ఆ fellow కనపడడం లేదు! అసలు ఏం జరిగింది? ID మార్చుకున్నాడా? లెక్క తేల్చేశాడా? లేక సౌత్ పోల్ దాటి బహిరంగ క్షమాపణలు చెప్పే స్థితిలో ఉన్నాడా?

    జనం ఊహించలేని పెద్ద కర్రెక్కు ఝలిపించిన తర్వాత, అతను అత్మచింతనలోకి వెళ్లిపోయాడా? నమ్మిన వ్యవస్థ నేలమట్టం అయ్యింది, గాలిలో కరిగిపోయింది… అది తట్టుకోలేక డిప్రెషన్ బంకర్‌లోకి దిగిపోయాడా?

    ఏం ఐనప్పటికీ, మనం ఊరుకోలేం!

    మనందరికీ తెలిసిన, మనతో నచ్చనచ్చని వాదించిన, మనం కసిగా తిట్టినా ఫుల్ స్పీడ్‌లో కౌంటర్ ఇచ్చిన మనోడిని మర్చిపోవడం న్యాయం కాదు!

    పానుగంటి గారు, కదులండి! కనీసం ఒక్క ముక్క చెప్పండి!

    మీకేం జరిగిందో తెలుసుకోవాలి. మీరు సేఫ్‌గా ఉన్నారో కదా? పచ్చదనం పూర్తిగా ఎర్రగా మారిపోయిందా? లేక నల్లగా మారి మౌన దీక్షలోకి వెళ్ళిపోయారా?

    ఏమైనా మీకో అండదండ కావాలా? ఓదార్పు కావాలా? చెప్పండి!

    మేము మీతో ఉన్నాం! మీ కోసం వెతుకుతున్నాం!

    ఇదిగో, రిపోర్టింగ్ ఫైల్ ఓపెన్ అయింది… న్యూస్ రావాలి! 🤨🔎

    1. వారి యొక్క సొంత స్థలం ను వైఎస్ఆర్ పార్టీ రెడ్డి కులం రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆక్రమణ చేసుకున్నారు.

      ఇన్నాళ్లు తాను డప్పు కొట్టిన పార్టీ వాళ్ళే తనని మోసం చేసేసరికి సిగ్గుతో తట్టుకో లేక, బయటకి చెప్పుకోలేక.. పాపం..

  4. యుక్త వయసులో పిల్లలకి అనేక ఆరోగ్య.సమస్యలు వస్తున్నాయి

    ఇక్కడ టీటీడీ వారి వలన తన ప్రాణాలు పోలేదు. తన అనారోగ్య కారణం వలన దురదృష్టం ప్రాణాలు పోయాయి.

    ఇందులో టీటీడీ ఉద్యోగుల తప్పు లేదా సేవల లో లోపం లేదు కదా.

  5. ఆ నీచుడు ఒక సారి పరిపాలిస్తేనే ఇన్ని అనర్థాలు జరిగాయి, శ్రీ వారి పట్ల అపచారం చేసిన పరమ నీచుడు ja***!!

Comments are closed.