అన్న‌దానంలో యువ‌కుడి మృతిపై టీటీడీ వివ‌ర‌ణ‌

యువ‌కుడి మృతికి సంబంధించి సొంత అభిప్రాయాల్ని ఆవిష్క‌రించ‌లేద‌ని టీటీడీ గ్ర‌హించాల్సిన అవ‌స‌రం వుంది.

తిరుమ‌లలో మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాదంలో స్పృహ కోల్పోయి, చికిత్స పొందుతూ క‌ర్నాట‌క రాష్ట్ర యువ‌కుడు మృతి చెంద‌డంపై టీటీడీ వివ‌ర‌ణ ఇచ్చింది. ఆ వివ‌ర‌ణ ఏంటంటే…

“ఈ నెల 22న‌ కర్ణాటక రాష్ట్రం మడికెరకు చెందిన మంజునాథ అనే బాలుడు తిరుమల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో సాయంత్రం భోజనం తర్వాత బయటకు వస్తూ అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అక్క‌డున్న సిబ్బంది వెంట‌నే తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో చేర్చారు. వైద్యుల స‌ల‌హా మేర‌కు తిరుపతిలోని స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దురదృష్టవశాత్తు ఆ బాలుడు ఈ రోజు (25వ తేదీ) మరణించాడు.

వాస్తవానికి ఆ బాలుడు దీర్ఘకాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. ఆరేళ్ల క్రిత‌మే గుండెకు చికిత్స చేయించుకున్నాడు. అయితే అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో తోపులాట కార‌ణంగా చ‌నిపోయాడనే ప్ర‌చారంలో నిజం లేదు” అని టీటీడీ వివ‌ర‌ణ ఇచ్చింది.

ఇదిలా వుండ‌గా మృతుడి కుటుంబ స‌భ్యుల ఆవేద‌న‌కు జ‌ర్న‌లిస్టు ప్ర‌తినిధులు అక్ష‌ర రూపం ఇచ్చారు. అంతే త‌ప్ప‌, యువ‌కుడి మృతికి సంబంధించి సొంత అభిప్రాయాల్ని ఆవిష్క‌రించ‌లేద‌ని టీటీడీ గ్ర‌హించాల్సిన అవ‌స‌రం వుంది.

15 Replies to “అన్న‌దానంలో యువ‌కుడి మృతిపై టీటీడీ వివ‌ర‌ణ‌”

  1. అసలు ఎవరి మీదైనా చర్యలు తీసుకోవాలంటే ముందు బీ ఆర్ నాయుడి మీదే. తరువాతే ఎవరైనా

  2. శవ రాజకీయం కి అక్షర రూపం నువ్వు….వికృత రూపం మీ పార్టీ….🙏🙏🙏…అంతే GA….

  3. సరే పవన్ చంబా లు తప్పు టీటీడీ వైపు ఉంది అని ఊరకుండొచ్చు కానీ బాడీ కనపడితే పూనకాలు తెచ్చుకునే మన జగనన్న ఎందుకు కనీసం ఖండించలేదు….సదురు వ్యక్తి కర్ణాటక వాడు అక్కడ వోట్ ఉంది కదా అనుకుని ఊరుకున్నారా ??ఎటు వారం వారం shuttle చేస్తున్నారు కృతజ్ఞతా పూర్వకం గా ఒక ట్వీట్ ఐన వెయ్యరా??? నిజం గ తొక్కిలసట జరిగి చనిపోతే అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న nda ప్రభుత్వం ని కార్నెర్ చేసేలా ఐన ఒక్క ట్వీట్ కూడా వెయ్యలేదా?? నిజం చెప్పడం పత్రికల దర్మం కనీసం ఈ విషయం లో ఐన పారదర్శకం గా ఉంటె మంచిది

  4. అయినా ఇలాంటి తప్పుడు ప్రచారాలు నీకు క్రొత్త కాదుగా మళ్ళీ భుజాలు తడుముకొనుట దేనికి సంకేతమో ఘనమైన GA గారూ

Comments are closed.