ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి డ్రీమ్ ప్రాజెక్టు మహా సముద్రం. నిజంగా మహా సముద్రం మాదిరిగానే వుంది దీని వ్యవహారం. హీరోలు మారుతున్నారు. నిర్మాతలు మారుతున్నారు. సినిమా మాత్రం సెట్ మీదకు వెళ్లడం లేదు. లేటెస్ట్ గా ఈ ప్రాజెక్టు అనిల్ సుంకర చేతికి వచ్చింది.
అక్కడ కూడా ఇంకా ఫైనల్ కాలేదు. నిర్మించడానికి ఓకె. కానీ ఎంతవుతుంది. కచ్చితంగా అనుకున్న బడ్జెట్ లోనే అవుతుందా? ఇలాంటి విషయాలు అన్నీ ఇంకా పెండింగ్ లో వున్నాయి. కరోనా కల్లోలం దాటాక వాటి మీద వర్క్ స్టార్ట్ అవతుంది.
అయితే హీరో మాత్రం శర్వానంద్ నే. మరో హీరో ఫైనల్ కావాలి. ప్రస్తుతానికి అయితే సినిమా ఎకె ఎంటర్ టైన్మెంట్స్ కాంపౌండ్ లోకి వచ్చి చేరింది. కరోనా హడావుడి ముగిసాక జరిగే చర్చల ఫలితాన్ని బట్టి, ఆ కాంపౌండ్ లో వుంటుందా? మరో కాంపౌండ్ లోకి వెళ్తుందా అన్నది తెలుస్తుంది.