రాజమౌళి- మహేష్- దేవా కట్టా

మహేష్ బాబుతో చేస్తున్న సినిమాకు దర్శకుడు దేవా కట్టాను డైలాగ్ రైటర్ గా తీసుకున్నారు.

2027 లో రాబోతోంది రాజమౌళి- మహేష్ బాబు సినిమా. రాజమౌళి సినిమాలకు పర్మనెంట్ మ్యూజిక్ డైరక్టర్ వుంటారేమో కానీ పర్మనెంట్ డైలాగు రైటర్ వుండరు. ఆయన రకరకాల రైటర్లతో పని చేయించుకుంటూ వుంటారు. బాహుబలికి ఇద్దరు యంగ్ రైటర్లతో రాయించుకున్నారు. అదే సమయంలో దర్శకుడు దేవా కట్టా కూడా ఓ చేయి అందించారు. తరువాత అదే దేవా కట్టా బాహుబలి ఓటీటీ సిరీస్ ను కూడా చేసారు.

తరువాత అదే రాజమౌళి బుర్రా సాయి మాధవ్ తో కూడా పని చేసారు. సినిమా మొత్తం పవర్ ఫుల్ డైలాగులు అవసరం లేదు రాజమౌళికి. సరైన చోట్ల సరైన డైలాగులు పడితే చాలు. మహేష్ బాబుతో చేస్తున్న సినిమాకు దర్శకుడు దేవా కట్టాను డైలాగ్ రైటర్ గా తీసుకున్నారు. మొత్తం డైలాగ్ వెర్షన్ ను రాసి అందించేసారు దేవా కట్టా.

దేవా కట్టా మంచి దర్శకుడు మాత్రమే కాదు. మంచి డైలాగ్ రైటర్ కూడా. తన సినిమాల్లో భావోద్వేగం, డెప్త్, మంచి అర్థవంతమైన సంభాషణలు వుంటాయి. ఇప్పుడు మహేష్ తో రాజమౌళి చేయబోయే ఫారెస్ట్ అడ్వంచర్ కు అంత హెవీ, ఎమోషనల్ డైలాగుల అవసరం వుంటుందని అనుకోవడానికి లేదు.

కానీ దేవా కట్టాకు ఇంగ్లీష్ లిటరేచర్ మీద కూడా మంచి పట్టు వుంది. బహుశా అది దృష్టిలో వుంచుకుని రాజమౌళి ఈసారి ఆయనతో ముందుకు వెళ్లారని అనుకోవాలి.

5 Replies to “రాజమౌళి- మహేష్- దేవా కట్టా”

Comments are closed.