నాని లేటెస్ట్ సినిమా హిట్ 3. తొలి రెండు భాగాల తరువాత మూడో భాగం ఇది. మే 1న విడుదల అవుతోంది ఈ సినిమా. సినిమా విడుదల మూడు వారాల దూరంలో వుండగానే సెన్సార్ చేయించేసారు. దీనికి కారణం మరేం లేదు. సినిమాలో వున్న వయిలెన్స్ చూసి సెన్సారు జనాలు కాస్త నివ్వెరపోయినట్లు తెలుస్తోంది. ఈ సీన్లు అన్నింటి మీద సినిమా టీమ్ తో గంట నుంచి గంటన్నర పాటు డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది.
ఏయే సీన్లు ఎక్కడెక్కడ బ్లర్ చేయాలి అనే డిస్కస్ చేసి ఫైనల్ చేయడానికి గంట నుంచి గంటన్నర సమయం పట్టినట్లు తెలుస్తోంది. హిట్ వన్, టూ రెండు భాగాలూ పూర్తిగా పరిశోధన మీద వెళ్లాయి. కానీ హిట్ త్రీ క్రయిమ్ ఎలా చేసారు .. దానికి ఎలా రివెంజ్ తీర్చుకున్నారు అదే దోవలో వెళ్తుందని తెలుస్తోంది.
ఇటీవల ఇతర భాషల్లో వచ్చిన కిల్, మార్కో సినిమాల్లో మితి మీరిన హింసతో వుంటాయి. ఇప్పుడు అదే పాట్రన్ లో ఈ హిట్ 3 వుంటుందని తెలుస్తోంది. అయితే అంత హింస, వయిలెన్స్ వున్నా జనాలు కనెక్ట్ అవుతారని యూనిట్ జనాల బోగట్టా.
నాని ధైర్యంగా తాను అనుకున్న ప్రయోగాలు చేస్తూ వెళ్తున్నారు. చాలా వరకు సక్సెస్ అవుతున్నారు. ఈసారి ఈ సినిమాతో ఆయన ప్రయోగం ఎలా వుంటుందో చూడాలి.
Our favourite Hero Nani’s upcoming movie Hit3 will be super hit movie.
Our favourite Hero Nani’s upcoming movie Hit 3 will be super hit movie.