మహేష్ బాబు – విదేశీ శిక్షణ

సూపర్ స్టార్ మహేష్ బాబు విదేశాల్లో వున్నారు. ఈ నెల 15 నాటికి తిరిగి వస్తారని తెలుస్తోంది. స్పెయిన్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం మహేష్ బాబు వున్నారట.  Advertisement ఇక్కడ బాడీ ఫిట్ నెస్,…

సూపర్ స్టార్ మహేష్ బాబు విదేశాల్లో వున్నారు. ఈ నెల 15 నాటికి తిరిగి వస్తారని తెలుస్తోంది. స్పెయిన్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం మహేష్ బాబు వున్నారట. 

ఇక్కడ బాడీ ఫిట్ నెస్, స్ట్రెంగ్త్ పెరగడానికి కొన్ని ఫిజికల్ ఎక్సర్ సైజ్ లు, శిక్షణ ను మహేష్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇది ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్. ఇటు ట్రీట్ మెంట్ కాదు, అటు ఫిట్ నెస్ ప్రోగ్రామ్ కాదు. అన్ని రకాలు కలిపిన ఓ ప్రోగ్రామ్. దీన్ని మహేష్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

ఫిజికల్ ఫిట్ గా వుండడంతో పాటు, బాడీ స్ట్రెంగ్త్ ను కూడా ఈ ప్రోగ్రామ్ పెంపొందిస్తుందని తెలుస్తోంది. అందుకే టైమ్ దొరకడంతో దుబాయ్ నుంచి భార్య, పిల్లలను వెనక్కు పంపేసి, మహేష్ తన కొద్ది మంది స్నేహితులతో కలిసి స్పెయిన్ కేసి వెళ్లినట్లు తెలుస్తోంది. తన వ్యక్తిగత సహాయకులు ఒకరిద్దరు, స్నేహితులు ఒకరిద్దరు మహేష్ తో వున్నారని బోగట్టా.

ప్రస్తుతం మహేష్ ఓ సినిమాను త్రివిక్రమ్ డైరక్షన్ లో చేస్తున్నారు. అది జనవరి 24 లో విడుదల. అందువల్ల షూటింగ్ కు ఇప్పటి నుంచీ తొందరపడడం లేదు యూనిట్. ఈ సినిమా తరువాత రాజమౌళి సినిమా. రాజమౌళితో సినిమా అంటే ఆ మాత్రం ఫిట్ నెస్ వుండాలి. బహుశా అందుకే ఇలాంటి ప్రోగ్రామ్ లకు మహేష్ బాబు ఎంచుకుంటున్నట్లు కనిపిస్తోంది.