ఎట్టకేలకు మహేష్ బాబు సెట్స్ పైకొచ్చాడు. దాదాపు 9 నెలల గ్యాప్ తర్వాత షూటింగ్ మొదలుపెట్టాడు. అయితే మహేష్ హీరోగా రాబోతున్న సర్కారువారి పాట సినిమా కాదు. ఓ యాడ్ షూట్ కోసం మహేష్ ఇలా సెట్స్ పైకొచ్చాడు.
హైదరాబాద్ అన్నపూర్ణ స్టుడియోస్ లో మహేష్ తో ఓ యాడ్ షూట్ స్టార్ట్ అయింది. ఈరోజు, రేపు ఈ యాడ్ షూటింగ్ కొనసాగుతుంది. లాక్ డౌన్ తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితమైన మహేష్.. సెట్స్ పైకి రావడం ఇదే ఫస్ట్ టైమ్.
ఓవైపు కరోనా వైరస్ పూర్తిగా తగ్గుముఖం పట్టనప్పటికీ.. మహేష్ ఇలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని సెట్స్ పైకొచ్చాడు. దీనికి సంబంధించి రిలీజైన స్టిల్ లో మహేష్ చేతిలో టీ కప్పుతో పాటు మాస్క్ పట్టుకొని ఉన్నాడు.
అయితే ఇదే ఊపులో మహేష్ బాబు తన కొత్త సినిమా స్టార్ట్ చేసే అవకాశం మాత్రం లేదు. తక్కువ మంది సిబ్బందితో యాడ్ షూట్ పూర్తిచేయొచ్చు. కానీ సర్కారువారి పాట లాంటి పెద్ద సినిమా షూటింగ్ కు మాత్రం భారీ యూనిట్ కావాల్సి ఉంటుంది. కాబట్టి మహేష్ సినిమా స్టార్ట్ అవ్వడానికి ఇంకాస్త టైమ్ పట్టొచ్చు. పరశురామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో కీర్తిసురేష్ ను హీరోయిన్ గా తీసుకున్న సంగతి తెలిసిందే.