మహేష్ బర్త్ డే ..మామూలుగా లేదుగా

సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆయన ఫ్యాన్స్, ఆయన పీఆర్ యూనిట్ చేస్తున్న హడావుడి మామూలుగా లేదు. గత వారం రోజులుగా ఏదో ఒక కంటెంట్ ఫ్యాన్స్ కోసం వదులుతూనే…

సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆయన ఫ్యాన్స్, ఆయన పీఆర్ యూనిట్ చేస్తున్న హడావుడి మామూలుగా లేదు. గత వారం రోజులుగా ఏదో ఒక కంటెంట్ ఫ్యాన్స్ కోసం వదులుతూనే వున్నారు. కొత్తగా కనిపిస్తున్న మహేష్ స్టిల్స్ ఒక్కోటీ వదులుతూ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తూనే వున్నారు.

అన్నింటికి మించి ట్విట్టర్ స్పేసెస్ లోకి సినిమా సెలబ్రిటీలను తీసుకువచ్చి మాట్లాడించబోతున్నారు. మహేష్ తో పని చేసిన, పనిచేయబోతున్న డైరక్టర్లు, నిర్మాతలు, మ్యూజిక్ డైరక్టర్లు ఇలా అందరూ 20 మంది వరకు ట్విట్టర్ స్పేసెస్ లోకి వచ్చి మహేష్ గురించి మాట్లాడతారు.  

సర్కారువారి పాట టీజర్ ను విడుదల చేయబోతున్నారు. ఈ టీజర్ కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు వచ్చిన ఏడాదిన్నర గ్యాప్ తరువాత వస్తున్న మహేష్ సినిమా టీజర్ ఇది. అలాగే గీతగోవిందం తరువాత పరుశురామ్ చేస్తున్న సినిమా. 

గెటప్ లో చేంజెస్ చేసి, లుక్ మార్చి, మహేష్ ను కొత్తగా చూపించే ప్రయత్నం జరుగుతోంది. అది ఎలా వుందో తెలియాలంటే కేవలం ఫోటొలు చూస్తే సరిపోదు. విడియో కావాలి. అదే టీజర్ రూపంలో వస్తోంది. 

యూ ట్యూబ్ లో, ట్విట్టర్ లో వున్న పాత రికార్డులు అన్నీ చెరిపి కొత్త రికార్డులు రాయాలని ఫ్యాన్స్ చేతిలో స్మార్ట్ ఫోన్ లతో రెడీ గా వున్నారు.