మహేష్ సినిమాలో బిగ్ స్టార్ ఎవరు?

త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ లో సినిమా సెట్ మీదకు వెళ్లాల్సి వుంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జ‌రుగుతున్నాయి. కీలకమైన టెక్నికల్ కాస్ట్, స్టార్ కాస్ట్ ఇది వరకే ఫిక్స్ అయిపోయింది.  Advertisement అయితే…

త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ లో సినిమా సెట్ మీదకు వెళ్లాల్సి వుంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జ‌రుగుతున్నాయి. కీలకమైన టెక్నికల్ కాస్ట్, స్టార్ కాస్ట్ ఇది వరకే ఫిక్స్ అయిపోయింది. 

అయితే విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం ఈ సినిమాకు ఓ కీలకమైన నటుడు కావాల్సి వుంది. అయితే అలా అని గతంలో వచ్చిన సినిమాల్లో మాదిరిగా మోహన్ లాల్ నో, సముద్రఖనినో, విజ‌య్ సేతుపతినో అలా కాదు. దాదాపు హీరోతో సమానమైన పాత్ర అని తెలుస్తోంది.

ఈ పాత్రకు ఇతర భాషల హీరో ఎవరైనా కావాల్సి వుంటుందని తెలుస్తోంది. అయితే ఎవర్ని తీసుకోవాలన్నది ఇంకా దర్శకుడు త్రివిక్రమ్ ఫిక్స్ కాలేదు. మలయాళ, తమిళ యంగ్ హీరోల వైపు దృష్టిసారిస్తున్నారని తెలుస్తోంది. త్రివిక్రమ్ సెలక్షన్, మహేష్ బాబు అంగీకారం రెండూ మ్యాచ్ అయిన తరువాత ఈ పేరు బయటకు వస్తుంది.

ప్రస్తుతం సర్కారువారి పాట ఫినిషింగ్ స్టేజ్ లో వుంది. ఇది విడుదల కావాలి. అప్పుడు మహేష్ సినిమా సెట్ మీదకు వెళ్తుంది. అప్పటి వరకు త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ రెండు సినిమాల స్క్రిప్ట్ వర్క్ లపై వుంటారు.