మహేష్ సినిమాలో ఎలుక ఎపిసోడ్

సరిలేరు నీకెవ్వరు…2020 మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటి. అనిల్ రావిపూడి-మహేష్ బాబుల క్రేజీ కాంబినేషన్. అనిల్ సుంకర-దిల్ రాజుల సంయుక్త నిర్మాణం. Advertisement ఈ సినిమా సెన్సారు పూర్తయింది. యు/ఎ వచ్చింది. రెండు గంటల…

సరిలేరు నీకెవ్వరు…2020 మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటి. అనిల్ రావిపూడి-మహేష్ బాబుల క్రేజీ కాంబినేషన్. అనిల్ సుంకర-దిల్ రాజుల సంయుక్త నిర్మాణం.

ఈ సినిమా సెన్సారు పూర్తయింది. యు/ఎ వచ్చింది. రెండు గంటల నలభై మూడు నిమిషాలకు కాస్త అటు ఇటుగా నిడివి వచ్చింది.

ఇదిలా వుంటే సినిమా తొలిసగంలో 39 నిమిషాల పాటు వుంటే ట్రయిన్ ఎపిసోడ్ హిలేరియస్ గా వుంటుంది. మరి దీనికి దీటుగా ద్వితీయార్థంలో ఏముండాలి?

అందుకే సుమారు 15 నిమిషాల ఎలుక ఎపిసోడ్ ఒకటి డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఎలుక ఎపిసోడ్ కూడా హిలేరియస్ గా వచ్చినట్లు బోగట్టా. 

అలాగే కమెడియన్లు వెన్నెల కిషోర్, సుబ్బరాజులను సెకండాఫ్ లో రంగంలోకి దింపారు. ఆ విధంగా ద్వితీయార్థంలో వచ్చే విజయశాంతి ఎమోషనల్ ఎపిసోడ్ లను బ్యాలన్స్ చేసినట్లు బోగట్టా. 

జగన్ గారు నాకు ఏంకావాలో అది తీరుస్తా అన్నాడు ::చిరు