హీరోలు గొంతెమ్మ కోరికలు కోరవచ్చు. నిర్మాతలు వాటిని తీర్చనూ వచ్చు. కానీ కొన్ని సార్లు కొన్ని కోర్కెలు తీర్చడం అంత వీజీ కాదు.
త్రివిక్రమ్-మహేష్ బాబు సినిమా రెండు అడుగులు ముందుకు, మూడు అడుగులు వెనక్కు అన్నట్లు సాగుతోంది. జనవరి విడుదల కనుక అస్సలు తొందరలేదు. మరో నాలుగైదు రోజుల్లో మహేష్ బాబు ఇండియాకు తిరిగి వస్తున్నారు. వచ్చే నెల అయిదు లేదు ఆరున షూట్ ప్రారంభం అవుతుంది.
చిన్న చిన్న గ్యాప్ లు మినహా 90 రోజుల పాటు కంటిన్యూగా షూట్ చేయాలన్నది ప్లాన్. ఇక్కడే చిన్న తకరారు వుందని తెలుస్తోంది. తనకు మొత్తం తొంభై రోజుల షెడ్యూలు ఇవ్వమని హీరో మహేష్ బాబు కోరుతున్నట్లు తెలుస్తోంది. అనుకున్న యాక్టర్ల డేట్ లు దొరక్క పోతే మార్చేసి, డేట్ లు దొరికేవారిని తీసుకోమని చెప్పినట్లు తెలుస్తోంది.
తనకు బౌండ్ స్క్రిప్ట్, తొంభై రోజుల షెడ్యూలు రెండూ ఇవ్వాల్సిందే అని మహేష్ పట్టుదలగా వున్నారని టాక్. అది త్రివిక్రమ్ వల్ల, నిర్మాత వల్ల అవుతుందా అన్నది చూడాలి. ఇదిలా వుంటే ఈ నెల 31న కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్, లుక్ వదిలేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మోసగాళ్లకు మోసగాడు మళ్లీ రీరిలీజ్ చేస్తున్నారు. ఆ థియేటర్లలో ఈ వీడియో ప్రదర్శనకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.