నాకు కరోనా వస్తే మహేష్ కామెడీ చేశాడు

రీసెంట్ గా కరోనా బారిన పడ్డాడు దర్శకుడు అనీల్ రావిపూడి. ఇప్పుడు పూర్తిగా కోలుకొని తన సినిమా పనుల్లో పడ్డాడు. ఈ సందర్భంగా 25 రోజుల కిందట తను ఎదుర్కొన్న కరోనా కష్టాల్ని బయటపెట్టాడు.…

రీసెంట్ గా కరోనా బారిన పడ్డాడు దర్శకుడు అనీల్ రావిపూడి. ఇప్పుడు పూర్తిగా కోలుకొని తన సినిమా పనుల్లో పడ్డాడు. ఈ సందర్భంగా 25 రోజుల కిందట తను ఎదుర్కొన్న కరోనా కష్టాల్ని బయటపెట్టాడు. కొంతమంది హీరోలు ఫోన్ చేసి పరామర్శించారని, మహేష్ మాత్రం కాల్ చేసి కామెడీ చేశారని చెప్పుకొచ్చాడు.

“మహేష్ పరామర్శ చాలా కొత్తగా ఉంటుంది. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, దాన్నుంచి మనల్ని బయటకు తీసుకురావడానికి ఆయన ప్రయత్నిస్తారు. నాకు కరోనా వచ్చింది, నేను బాధలో ఉన్నాననే ఆలోచనతో ఆయన మాట్లాడరు. ముందు క్యాజువల్ గా పలకరించారు. తర్వాత కామెడీ స్టార్ట్ చేశారు. మీరెక్కడికివెళ్లారు, మీరెందుకు తగిలించుకున్నారంటూ కామెడీ చేశారు.”

3-4 రోజులకు ఒకసారైనా గుర్తుపెట్టుకొని మరీ మహేష్ తనకు ఫోన్ చేసి సరదాగా మాట్లాడారని.. ఆ టైమ్ లో తనలో కాన్ఫిడెన్స్ పెంచిన వ్యక్తి మహేష్ మాత్రమేనని చెప్పుకొచ్చాడు రావిపూడి. వరుణ్ తేజ్, వెంకటేష్ కూడా కాల్ చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు.

“నాకు కరోనా వచ్చిన టైమ్ కే వరుణ్ తేజ్ కు కరోనా వచ్చి తగ్గిపోయింది. ఇద్దరం మాట్లాడునేవాళ్లం. కంగారు పడకని చెప్పేవాడు. టేస్ట్ పోయిందా, వాసన పోయిందా అంటూ 5-6 రోజులు మాట్లాడుకున్నాం. వెంకటేష్ గారు ఫోన్ చేశారు. జాగ్రత్తగా ఉండమని చెప్పారు. చాలా సూచనలు చేశారు.”

కరోనా రావడం ఒక బాధైతే.. పిల్లలకు దూరంగా ఐసొలేషన్ లో ఉండడం ఇంకా పెద్ద బాధ అంటున్నాడు అనీల్ రావిపూడి. తను, తన భార్య ఐసొలేషన్ లో ఉన్నప్పుడు బంధువులు బాగా చూసుకున్నారని అన్నాడు.