ఆర్ఆర్ఆర్..ఓన్లీ పోస్టర్

ఎన్టీఆర్ బర్తేడే సందర్భంగా ఆర్ఆర్ఆర్ నుంచి ఓ పోస్టర్ వచ్చింది. పుట్టిన రోజు ప్రోటోకాల్ కోసం అన్నట్లుగా వదిలినట్లు వుంది. పోస్టర్ బాగుంది. ఈటెను గురి చూసి విసురుతున్న ఎన్టీఆర్ ఫోజ్ ను పోస్టర్…

ఎన్టీఆర్ బర్తేడే సందర్భంగా ఆర్ఆర్ఆర్ నుంచి ఓ పోస్టర్ వచ్చింది. పుట్టిన రోజు ప్రోటోకాల్ కోసం అన్నట్లుగా వదిలినట్లు వుంది. పోస్టర్ బాగుంది. ఈటెను గురి చూసి విసురుతున్న ఎన్టీఆర్ ఫోజ్ ను పోస్టర్ గా వదిలారు. 

బ్యాక్ డ్రాప్ లో సముద్రం, ఉరుముల మెరుపుల ఆకాశం కనిపిస్తుండగా పంచెకట్టులో వున్న తారక్ చేతిని ముందుకు సాచి, గురిపెట్టి బల్లెం విసురుతున్న స్టిల్ అది. ఆర్ఆర్ఆర్ నుంచి ఇప్పటికి ఎన్టీఆర్ కు సంబంధించి ఓ విడియో బైట్ గతంలో వచ్చింది. 

మళ్లీ ఈసారి కూడా విడియో బైట్ వస్తుందేమో అనుకున్నారు ఫ్యాన్స్. కానీ సినిమా ఇఫ్పట్లో విడుదల లేదు. చాలా దూరం వుంది. ముందు ముందు పబ్లిసిటీ కోసం చాలా కంటెంట్ వదలాల్సి వుంటుంది. అందుకే కావచ్చు ఈసారి ఇలా పోస్టర్ తో సరిపెట్టారు.

ఆర్ఆర్ఆర్ ఈ ఏడాది దసరా టైమ్ లో విడుదల కావాల్సి వుంది. కానీ వచ్చే సంక్రాంతికి వస్తుందా? లేదా సమ్మర్ కు వస్తుందా? అన్నది ప్రస్తుతం డిస్కషన్ పాయింట్ గా వుంది. 

కరోనా రెండో ధశకు ముందు లెక్కల ప్రకారం జూలై నెలాఖరు వరకు షూటింగ్ వుంది. ఇప్పుడు మరి ఆ లెక్కన ఎప్పుడు స్టార్ట్ చేస్తే ఎప్పటి వరకు వుంటుందన్నది ఇప్పట్లో తెలియదు.  దాన్ని బట్టే 2021 సంక్రాంతినా? సమ్మర్ నా? అన్నది డిసైడ్ అయి వుంటుంది.