బ్రాండింగ్‌లో సూపర్ స్టార్ మహేష్ ది ఓ లెవెల్ అంతే. ఎక్కడెక్కడి కంపెనీలు మహేష్ ను వెదుక్కుంటూ వస్తాయి. అలా వచ్చిన వాటిలో ఫోన్ పే ఒకటి.
కొన్నాళ్ల క్రితం ఫోన్ పే మహేష్ ను కాంట్రాక్ట్ చేసింది బ్రాండింగ్ కోసం. లేటెస్ట్ గా ఫోన్ కు ఓ కొత్త ఐడియా వచ్చింది. సాధారణంగా మనం ఎవరైనా ఎక్కడైనా ఫోన్ పే లో డబ్బులు చెల్లించినపుడు అక్కడున్న చిన్న స్పీకర్ లో ‘రిసీవ్డ్ రుపీస్’ అంటూ వాయిస్ వస్తుంది. అది ప్రీ రికార్డెండ్ లేడీ వాయిస్.
ఇప్పుడు ఆ వాయిస్ కు బదులుగా నార్త్ లో అమితాబ్ వాయిస్ ను, తెలుగులో మహేష్ వాయిస్ ను వాడాలని ఫోన్ పే ప్లాన్ చేసింది. ఇది త్వరలో అమలులోకి వస్తుంది. దీనికి గాను మహేష్ కు ఫోన్ పే చెల్లించింది అయిదు కోట్ల పారితోషికం అని తెలుస్తోంది. అందరూ ఫోన్ పే లో పే చేస్తే, ఫోన్ పే మహేష్ కు ఫోన్ పే చేసినట్లు అన్నమాట.
నిజానికి ఈ ఒప్పందం కాస్త పాతది. అదే ఇప్పుడైతే మహేష్ కు వున్న క్రేజ్ కు ఇంకా పెద్ద మొత్తం ఆఫర్ చేస్తారేమో? పైగా ఇప్పుడే ఇలా వుంటే రాజమౌళి సినిమాతో పాన్ ఇండియాకు పరిచయం అయితే ఇంకెలా వుంటుందో?