మరో విదేశీ పర్యటన పూర్తిచేశాడు మహేష్. కొన్ని రోజుల కిందట విదేశాలకు వెళ్లిన ఈ హీరో, ఇప్పుడు హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. దీంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ చేస్తున్న సినిమాలో మరోసారి కదలిక వచ్చింది. అయితే ఇక్కడే ఓ చిన్న మెలిక ఉంది.
మహేష్ రావడమైతే వచ్చాడు కానీ, ఇప్పట్లో సినిమా సెట్స్ పైకి రావడం లేదు. ఈ నెలలో అతడికి వేరే అపాయింట్ మెంట్స్, కమిట్ మెంట్స్ ఉన్నాయి. అవన్నీ పూర్తిచేసుకొని, వచ్చేనెల నుంచి త్రివిక్రమ్ సినిమాపైకి రాబోతున్నాడు మహేష్.
ఈ గ్యాప్ లో ఈ సినిమాకు సంబంధించి టైటిల్ రివీల్ చేయబోతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మహేష్-త్రివిక్రమ్ మూవీ టైటిల్ బయటకు రాబోతోంది. ఇప్పటికే మార్కెట్లో అమరావతికి అటుఇటు, గుంటూరు కారం, ఊరికి మొనగాడు లాంటి టైటిల్స్ చక్కర్లు కొడుతున్నాయి.
వీటిలో ఒక టైటిల్ ను ప్రకటిస్తారా లేక ఈ గ్యాప్ లో మరో టైటిల్ ఫిక్స్ చేసి ప్రేక్షకుల ముందుకొస్తారా అనేది చూడాలి. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలకు సంబంధించి ఏవేవో టైటిల్స్ తెరపైకొస్తుంటాయి. చివరికి మరో టైటిల్ ప్రకటిస్తారు. ఈసారి కూడా అలానే జరుగుతుందా లేక నలుగుతున్న టైటిల్ నే లాక్ చేస్తారా అనేది చూడాలి. మహేష్ ల్యాండ్ అయ్యాడు కాబట్టి టైటిల్ పై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చేస్తుంది.
మరోవైపు ఈ సినిమా షూటింగ్ పడుతూలేస్తూ సాగుతోంది. రిలీజ్ డేట్ ను ఎలాగూ వాయిదావేశారు కాబట్టి, నిదానంగా షూట్ చేద్దామనే ఆలోచనలో యూనిట్ ఉంది.