రేపు గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోంది సరిలేరు నీకెవ్వరు సినిమా. ఈ సందర్భంగా యూనిట్ అంతా కలిసి ఇంటర్వ్యూ ఇచ్చింది. సినిమా హైలెట్స్ మాత్రమే కాకుండా, షూటింగ్ టైమ్ లో జరిగిన ఫన్ మూమెంట్స్ ను కూడా అంతా పంచుకున్నారు. ఈ సందర్భంగా తన గెటప్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపెట్టాడు మహేష్. ఆర్మీ రోల్ కోసం ఒకే నెలలో 6 కిలోలు తగ్గానని చెప్పుకొచ్చాడు.
“నటన పరంగా నేను హోమ్ వర్కులు చేయను. అక్కడికక్కడ స్పాంటేనియస్ గా వచ్చిందే చేస్తాను. కానీ ఆర్మీ రోల్ కోసం అనీల్ రావిపూడి మాత్రం చాలా రీసెర్చ్ చేశాడు. అది నాకు హెల్ప్ అయింది. మొదటి రోజు కాస్త ఇబ్బంది అనిపించినా, రెండో రోజు నుంచి సెట్ అయిపోయింది. యూనిఫాం వేసుకోగానే ఫీల్ వచ్చేసింది. సినిమాలో ఆ బ్లాక్ మొత్తం చాలా బాగా వచ్చింది. ఇక లుక్ పరంగా మాత్రం ఆర్మీ రోల్ కోసం చాలా కష్టపడ్డాను. లెక్కప్రకారం జూన్ లో షూట్ చేయాలి. కానీ జులైలో షూట్ చేశాం. ఈ నెల రోజుల్లో 6 కిలోలు తగ్గాను. ఆర్మీ సోల్జర్ లా కనిపించాలంటే ఆమాత్రం కష్టపడాల్సిందే.”
సరిలేరు నీకెవ్వరు సినిమా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందంటున్నాడు మహేష్. అంతేకాదు.. ఇప్పటివరకు కెరీర్ పరంగా తను తీసుకున్న నిర్ణయాల్లో ది బెస్ట్ డెసిషన్ ఇదేనంటున్నాడు.