ష‌ర్ట్ తీసేసిన మ‌హేశ్.. పిక్స్ పెట్టిన న‌మ్ర‌త‌!

టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలు సినిమాల్లో సీన్ల‌కు అనుగుణంగా ష‌ర్ట్ విప్పి త‌మ బాడీ ప్యాక్స్ ను చూపిస్తూ ఉంటారు. సిక్స్ ప్యాక్స్, ఎయిట్ ప్యాక్స్ ట్రెండ్స్ ను ద‌శాబ్దం, ద‌శాబ్దంన్న‌ర…

టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలు సినిమాల్లో సీన్ల‌కు అనుగుణంగా ష‌ర్ట్ విప్పి త‌మ బాడీ ప్యాక్స్ ను చూపిస్తూ ఉంటారు. సిక్స్ ప్యాక్స్, ఎయిట్ ప్యాక్స్ ట్రెండ్స్ ను ద‌శాబ్దం, ద‌శాబ్దంన్న‌ర కింద‌టే చూశారు తెలుగు సినీ ప్రేక్ష‌కులు. 

మ‌రి అలాంటి ట్రెండ్ లో చాలా మంది స్టార్ హీరోలు త‌ప్ప‌నిస‌రిగా అయినా బాడీ పెంచి, ష‌ర్ట్ విప్ప‌క త‌ప్ప‌లేదు. ఇప్ప‌టి యంగ్ జ‌న‌రేష‌న్ హీరోలు అయితే రావ‌డం రావ‌డంతోనే ఫిట్ బాడీతో ప‌ల‌క‌రిస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి ట్రెండ్ లో కూడా ష‌ర్ట్ లెస్ లో న‌టించ‌డానికి పెద్ద ఇష్టం చూప‌ని హీరో మ‌హేశ్.

ఒక ద‌శ‌లో త‌ను కూడా సిక్స్ ప్యాక్స్ కు ట్రై చేసిన‌ట్టుగా, దాని వ‌ల్ల మొహంలో కూడా ఏదో మార్పు వ‌స్తుండ‌టంతో ఆపేసినట్టుగా మహేశ్ స్వ‌యంగా చెప్పాడు. ఇక సినిమాల్లో మ‌హేశ్ ష‌ర్ట్ తీసి బ‌నియ‌న్ తో కొన్ని సార్లు బాడీ షేప్స్ చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. అవంత నోటీస్ కాలేదు! లుంగీ లుక్ లో ప్రేక్ష‌కుల‌కు ఉత్సాహం తీసుకొచ్చిన స్థాయిలో ఆ సీన్లు హైలెట్ కాలేదు.

ఆ సంగ‌త‌లా ఉంటే.. మ‌హేశ్ ఫిట్ బాడీ పిక్స్ ను ఇన్ స్టాలో షేర్ చేసింది ఆయ‌న భార్య న‌మ్ర‌త. మ‌హేశ్ బాబు స్విమ్మింగ్ పూల్ లో ఉండ‌గా.. తీసిన పిక్స్ ను న‌మ‌త్ర పోస్ట్ చేసింది. టు కూల్ ఫ‌ర్ ది పూల్ అంటూ ఈ ఫొటోల‌కు హ్యాష్ ట్యాగ్ పెట్టింది న‌మ్ర‌త‌. పోస్టు చేసిన నిమిషాల వ్య‌వ‌ధిలోనే ఈ ఫొటోల‌కు వేల కొద్దీ లైక్స్ వ‌చ్చాయి.