రోడ్డు మీద కార్పోరేటర్లు… టెన్షన్… టెన్షన్

వారు మహా విశాఖ కార్పోరేషన్ కి చెందిన కార్పోరేటర్లు. విశాఖను మరింతగా అభివృద్ధి చేయాలన్న ఉత్సాహంతో స్టడీ టూర్ పెట్టుకున్నారు. దేశంలో ఢిల్లీ సహా పలు ఉత్తరాది కార్పోరేషన్ల పనితీరుని చూసి విశాఖలో తమ…

వారు మహా విశాఖ కార్పోరేషన్ కి చెందిన కార్పోరేటర్లు. విశాఖను మరింతగా అభివృద్ధి చేయాలన్న ఉత్సాహంతో స్టడీ టూర్ పెట్టుకున్నారు. దేశంలో ఢిల్లీ సహా పలు ఉత్తరాది కార్పోరేషన్ల పనితీరుని చూసి విశాఖలో తమ పాలనకు మెరుగులు దిద్దాలనుకున్నారు. అయిదు రోజుల క్రితం విశాఖ నుంచి దాదాపుగా 85 మంది కార్పోరేటర్లు ఉన్నత అధికారులు, మేయర్ సహా ఈ పర్యటన చేపట్టారు.

అంతా బాగా సాగుతోంది. ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, సిమ్లాలలో టూర్ పూర్తి చేసుకున్నారు. కులుమనాలీ వెళ్ళిన కార్పోరేటర్లు అక్కడ మాత్రం చిక్కుల్లో పడ్డారు. చండీగడ్ రావాలనుకుని రోడ్డు మార్గాన బస్సులలో వస్తున్న కార్పోరేటర్లకు అక్కడ ఘాట్ రోడ్డు మీద కొండ చరియలు ఒక్కసారిగా విరిగిపడడంతో వారు ప్రయాణిస్తున్న బస్సు మధ్యలో నడి రోడ్డు మీదనే నిలిచిపోయింది.

దాంతో రోడ్డు మీదనే బస్సులలో కార్పోరేటర్లు వేచి ఉండాల్సి వచ్చింది. ఇలా పడిన కొండ చరియలను తీసి ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఆర్మీ రంగంలోకి దిగారు. అయితే ఇది మొత్తం క్లియర్ చేయడానికి చాలా టైమ్ పడుతుంది అని అంటున్నారు. దాంతో కార్పోరేటర్లు అక్కడ ఘాట్ వద్ద చిక్కుకుపోయారు.

దీంతో ఆహ్లాదంగా సాగుతున్న విశాఖ కార్పోరేటర్ల స్టడీ టూర్ ఇపుడు టెన్షన్ లో పడింది. దాంతో విశాఖలోని వారు బంధువులు కూడా తల్లడిల్లుతున్నారు. అయితే ఎలాంటి ప్రమాదం లేదని, కొంత ఆలస్యం తప్ప అంతా సవ్యంగానే జరుగుతోందని విశాఖ మేయర్ హరి వెంకటకుమారి అక్కడ నుంచే సందేశం పంపించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. స్టడీ టూర్ అంటూ వెళ్ళిన కార్పోరేటర్లు ప్రకృతి వైపరిత్యాన్ని కూడా స్టడీ చేయాల్సి వచ్చింది.