నేను హాలిడేస్ కి వెళ్తే మీకేంటి ప్రాబ్లమ్ – మహేష్

టైమ్ దొరికితే విదేశాలకు చెక్కేస్తుంటాడు మహేష్. కుటుంబంతో జాలీగా గడిపి తిరిగి ఇండియాకు వస్తుంటాడు. అయితే ఈ క్రమంలో అతడిపై కాస్త ట్రోలింగ్ కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే. విదేశాల్లో గడిపిన రోజుల్లో సగం…

టైమ్ దొరికితే విదేశాలకు చెక్కేస్తుంటాడు మహేష్. కుటుంబంతో జాలీగా గడిపి తిరిగి ఇండియాకు వస్తుంటాడు. అయితే ఈ క్రమంలో అతడిపై కాస్త ట్రోలింగ్ కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే. విదేశాల్లో గడిపిన రోజుల్లో సగం రోజులు సినిమాకు కేటాయిస్తే, ఈ పాటికి గుంటూరుకారం షూటింగ్ అయిపోయేదంటూ మహేష్ పై విమర్శలు గుప్పించేవాళ్లు కూడా ఉన్నారు.

ఇలాంటి కామెంట్స్ తన వరకు కూడా వచ్చాయన్నాడు మహేష్. అంతేకాదు.. ఈ అంశంపై సూటిగా స్పందించాడు. నేను ఫ్యామిలీతో కలిసి హాలిడేస్ కు వెళ్తే మీకేంటి ప్రాబ్లమ్ అంటూ సూటిగా స్పందించాడు.

“నేను రెగ్యులర్ గా హాలిడేస్ కు వెళ్తాను. నేను ఇనస్టాగ్రామ్ లో పెడితేనే కదా అందరికీ తెలుస్తుంది. ఆ కామెంట్స్ నా వరకు కూడా వచ్చాయి. నాకు షూటింగ్ లో గ్యాప్ దొరికినా, పిల్లలకు శెలవులు వచ్చినా మేమంతా కలిసి చిన్న హాలిడేస్ కు వెళ్తుంటాం. నా ఫొటోలు అందరికీ నచ్చుతున్నాయనే అనుకుంటున్నాను. ఎవరైనా ఈర్ష్య పడుతున్నారేమో నాకు తెలీదు. అయినా నేను హాలిడేస్ కు వెళ్తుంటే వేరే వాళ్లకు నచ్చకపోవడానికి ఏముంది అందులో.”

ఇలా తన హాలిడే ట్రిప్స్ పై సూటిగా స్పందించాడు మహేష్. రాబోయే రోజుల్లో కూడా తనకు గ్యాప్ దొరికినప్పుడు, పిల్లలకు హాలిడేస్ వచ్చినప్పుడు కచ్చితంగా ట్రిప్స్ కు వెళ్తానని స్పష్టం చేశాడు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరుకారం సినిమా చేస్తున్నాడు మహేష్. చాన్నాళ్లుగా ఈ సినిమా షూట్ పెండింగ్ లో ఉంది. షూటింగ్ కూడా ఆలస్యమౌతుండడంతో, విడుదల తేదీపై అనుమానాలు పెరిగాయి. వీటిపై కూడా క్లారిటీ ఇచ్చాడు మహేష్. గుంటూరు కారం సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి వచ్చి తీరుతుందని ప్రకటించాడు.