సాధారణంగా హీరోలు ఎవ్వరైనా తమ పర్సనల్ స్టాఫ్ ను జాగ్రత్తగా చూసుకుంటారు. ఎందుకంటే ఈరోజుల్లో నమ్మకంగా, తమ మనసు తెలుసుకుని పని చేసే సిబ్బంది దొరకడం అన్నది కష్టం కాబట్టి. హీరో మహేష్ బాబు కూడా తన పర్సనల్ స్టాఫ్ ను అలాగే చూసకుంటారు. స్టాఫ్ ఆలనా పాలనా మాత్రమే కాకుండా, వారి పిల్లల చదువులు వగైరా కూడా చూస్తారు.
అందుకే మహేష్ బర్త్ డే సందర్భంగా ఆ పర్సనల్ స్టాఫ్ అంతా కలిసి ఓ విడియో విడుదల చేసారు. మేకప్ మెన్ పట్టాభి నుంచి, పర్సనల్ మేనేజర్ కోటి వరకు అందరూ తమ తమ మనసులోని మాటలు చెప్పి ఆ విడియో తయారుచేసారు. మహేష్ బాబు తమను ఎలా చూసుకుంటారో వివరించారు. పట్టాభి అయితే తన కొడుకు ఉన్నత చదువుకు మహేష్ సాయం చేసిన వైనం వివరించారు.
వీరిలో కొంత మంది సూపర్ స్టార్ కృష్ణ నుంచి మహేష్ దగ్గరకు వచ్చిన వారు కూడా వున్నారు. అంతా బాగానే వుంది. కృష్ణ దగ్గర నుంచి అసోసియేట్ అవుతూ మహేష్ బాబుకు పర్సనల్ పీఆర్వో గా బిఎ రాజు బైట్ కూడా ఇందులో వుంటే బాగుండేదేమో?