అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రమ్యకృష్ణ నటించే అవకాశం కనిపిస్తోంది. మహేష్ తో హారిక హాసిని నిర్మించే సినిమాలో ఓ సీనియర్ హీరోయిన్ కు కీలకపాత్ర వుంది.
శోభన అయితే ఎలా వుంటుంది అని ఆలోచించారు. ఆమె ను కాంటాక్ట్ చేయడమే ఒకంతట వీలు కాలేదు. మొత్తానికి హైదరాబాద్ వచ్చారు. మాట్లాడారు. అన్నీ జరిగాయి. కానీ డెసిషన్ పెండింగ్ లో వుంచారు. మరో ఆప్షన్ ఏమైనా వుంటుందా అనే ఆలోచనలు సాగుతున్నట్లు తెలుస్తోంది.
రాజమాత రమ్యకృష్ణ ఇప్పటి వరకు త్రివిక్రమ్ సినిమాలో నటించలేదు. ఆమెను తీసుకుంటే సినిమాకు హై వస్తుందని భావిస్తున్నారు. గతంలో మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో విజయశాంతి నటించారు. అప్పుడు చాలా హై వచ్చింది. ఇప్పుడు కూడా అదే విధమైన కాంబినేషన్ అయితే బెటర్ అని, అలాంటపుడు రమ్యకృష్ణ రైట్ ఛాయిస్ అని అనుకుంటున్నారు.
రమ్యకృష్ణ, శ్రీలీల వీళ్లంతా షూట్ లో జాయిన్ కావడానికి ఇంకా టైమ్ వుంది. అందువల్ల రమ్యకృష్ణ ను మెయిన్ ఆప్షన్ గా పెట్టుకున్నారు. మిగిలిన చాయిస్ లు కూడా వెదుకుతున్నారు. మహేష్ సరసన పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్న సినిమాలో ఇప్పటికే జగపతి బాబు వగైరా భారీ తారాగణం వుంది.