గూగుల్ లో సుప్రియ అని టైప్ చేస్తే గతంలో ఎవరు హైలెట్ అయ్యారో తెలియదు కానీ.. ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ ఫైనల్స్ మ్యాచ్ తర్వాత మాత్రం సుప్రియ అని టైపు చేస్తే, సుప్రియ అనయ్య మాత్రమే కనిపిస్తోంది. ఆ మ్యాచ్ లో కేరింతలు కొడుతూ తన భర్త రోహన్ బోపన్నను ఎంకరేజ్ చేస్తూ కెమెరా కళ్లన్నీ తనవైపే తిరిగేలా చేసుకుంది సుప్రియ అనయ్య అలియాస్ సుప్రియ బోపన్న. ఆ మ్యాచ్ జరుగుతుండగానే సుప్రియ అందం అందర్నీ ఆకట్టుకుంది.
ఈ ప్రపంచంలో నేను చూసిన అత్యంత అందమైన మహిళ సుప్రియ అంటూ ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. టెన్నిస్ ప్లేయర్స్ పార్టనర్స్ లో మహారాణి ఆమేనని అన్నాడు. ఆమె ఓ సైకాలజిస్ట్ అంట కదా అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టాడు. “నేను అంగీకరిస్తున్నాను” అంటూ.. ఆ ట్వీట్ కి బోపన్న రిప్లై ఇవ్వడంతో ఆ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
సహజంగా టెన్నిస్ ప్లేయర్ల భార్యలు స్టేడియంలోకి వచ్చి భర్తలను ఎంకరేజ్ చేయడం చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ అలా ఎంకరేజ్ చేసే మహిళ అందగత్తె కావడంతో ఆమె టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారింది.
గతంలో స్టెఫీగ్రాఫ్, సానియా మీర్జా లాంటి తారలు టెన్నిస్ మ్యాచ్ ఆడితే.. ప్లే గ్రౌండ్ కి వాళ్లే సెంటరాఫ్ అట్రాక్షన్. ఆటకు గ్లామర్ అద్దిన వాళ్లను పొగుడుతూ ఏకంగా పాటలు కూడా పుట్టుకొచ్చాయి. అయితే ఈసారి కోర్టులో సానియా మీర్జా ఉన్నప్పటికీ.. ఆమెను కాదని మరో మహిళను అందగత్తె అంటూ పొగిడారంటే సుప్రియ క్రేజ్ ఏంటో అర్థమైపోతుంది.
అవును, ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది సుప్రియ అనయ్య గురించే వెదుకుతున్నారు. ఆమె ఫొటోల కోసం తెగ సెర్చ్ చేస్తున్నారు.
2012లో రోహన్ బోపన్న, సుప్రియకు వివాహం అయింది, అప్పటినుంచీ ఆమె రోహన్ మ్యాచ్ లన్నిటికీ వస్తుంది. వృత్తిపరంగా సైకాలజిస్ట్ అయిన ఆమె, తన భర్తకు చెందిన కంపెనీ, డైట్, ఎండోర్స్ మెంట్స్ కూడా చూసుకుంటుంది. వారికి త్రిథ అనే పాప కూడా ఉంది.
అలా దశాబ్దానికి పైగా బోపన్నతో కలిసి ట్రావెల్ చేస్తున్న సుప్రియ.. అనుకోకుండా తీసిన కొన్ని ఫొటోలతో పాపులర్ అయింది. ఒక్కో టైమ్ లో ఒక్కొకర్ని ఆకాశానికెత్తేస్తుంది సోషల్ మీడియా. ఇప్పుడు సుప్రియ టైమ్ నడుస్తోంది, అంతే.