మేజ‌ర్ బయోపిక్ లో లిప్ లాక్!

అడవిశేష్ తెలుగు వారి కమల్ హాసన్. మంచి నటుడు, రచయిత, దర్శకుడు, మంచి సినిమాకు కేరాఫ్ అడ్రస్ గా నిలవాలని అనుకుంటాడు. అందుకే తక్కువ కాలంలో మంచి పేరు తెచ్చుకున్నాడు.  Advertisement కమల్ హాసన్…

అడవిశేష్ తెలుగు వారి కమల్ హాసన్. మంచి నటుడు, రచయిత, దర్శకుడు, మంచి సినిమాకు కేరాఫ్ అడ్రస్ గా నిలవాలని అనుకుంటాడు. అందుకే తక్కువ కాలంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. 

కమల్ హాసన్ కు వున్న మరో అలవాటు ఒకటి అడవి శేష్ కు కూడా వుంది. అదే లిప్ లాక్ లు. తన సినిమాల్లో లిక్ లాక్ లు సహజంగానే వుంటూ వుంటాయి.

లేటెస్ట్ గా అడవి శేష్ చేస్తున్న సినిమా మేజ‌ర్. ఈ సినిమా ఓ బయోపిక్. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మేజ‌ర్ సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్. ఈ బయోపిక్ లో రొమాంటిక్ సీన్లు బాగానే దట్టించినట్లు ట్రయిలర్ లో వెల్లడయింది. అడవి శేష్ అక్కడితో ఆగకుండా లిప్ లాక్ సీన్ కూడా చొప్పించినట్లు తెలుస్తోంది.

మేజ‌ర్ కాలేజీ డేస్, లవ్, రోమాన్స్ వ్యవహారాల్లో భాగంగా ఈ లిప్ లాక్ వస్తుందని తెలుస్తోంది. జి ఎమ్ బి పతాకంపై హీరో మహేష్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.