ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కింజరాపు అచ్చెన్నాయుడు ఆరడుగుల పొడవున్న నాయకుడు. ఆయన గంభీరమైన రూపం చూస్తే చాలు ఎవరైనా అలా ఉండిపోతారు. ఇక పొలిటికల్ గా అచ్చెన్నాయుడు చాలా దూకుడుగానే ఉంటారు. ఆయన టీడీపీ సీనియర్ నాయకుడు. మరి ఇంతటి కీలక నాయకుడు తనకు ప్రాణ భయం ఉంది అని అంటున్నారు.
ఈ మేరకు ఆయన రాష్ట్ర డీజీపీకి ఒక లేఖ రాస్తూ తనకు వన్ ప్లస్ వన్ ఉన్న సెక్యూరిటీని ఫోర్ ప్లస్ ఫోర్ గా పెంచాలని కోరారు. తనకు సంఘ వ్యతిరేక శక్తుల నుంచి ముప్పు ఉందని అచ్చెన్న అంటున్నారు. అదే విధంగా తాను ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున గళం విప్పుతున్న క్రమంలో అన్ని చోట్లా విస్తృతంగా తాను పర్యటించాలని ఆయన అంటున్నారు.
ఇక నేరస్థుల నుంచి అవాంచనీయ శక్తుల నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉన్న నేపధ్యంలో భద్రత పెంచాలని అచ్చెన్న కోరుతున్నారు. సరే అచ్చెన్న భద్రత అందరి భద్రత, అది అందరి బాధ్యత అనుకున్నా అచ్చెన్న తాను జనంలో తిరగాలి కాబట్టి తనకు రక్షణ కావాలని అంటున్నారు.
మరి అదే టైన్ లో టీడీపీ తమ్ముళ్ళు ఇతర నాయకులు కూడా జనంలో తిరుగుతున్నారు కదా. వారికి లేని భయం రాష్ట్ర పార్డీ పెద్దకు ఎందుకు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇక గతంలో కూడా టీడీపీ పదేళ్ల పాటు విపక్షంలో ఉంది. మరి నాడు భద్రత విషయాన్ని అచ్చెన్న కానీ ఇతరులు కానే ఊసుకైనా ఎత్తలేదు.
ఇపుడు అడుగుతున్నారు అంటే అంత ప్రాణ హాని చేసే వారు కింజరాపు ఫ్యామిలీకి ఎవరు ఉన్నారు అన్నదాని మీద కూడా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఏది ఏమైనా అచ్చెన్నాయుడు తానుగా చెప్పుకునే రేపటి కాబోయే హోం మంత్రి కాబట్టి ఆయనకు భద్రత పెంచాల్సిందే. కోరి మరీ అడిగారు కాబట్టి భద్రత పెంచడంలో తప్పు అయితే లేదు.