రెండున్నర గంటల్లో చెప్పే కథకు ముగింపు ఇవ్వడం ఓ విధంగా ఈజీ. స్టార్టింగ్-ఎండింగ్ ముందే అనుకుంటారు. అదే సినిమాను పార్ట్-1, పార్ట్-2గా తీసినప్పుడు మాత్రం మొదటి భాగానికి ముగింపు ఇవ్వడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం.
రెండో భాగంపై ఆసక్తి రేకెత్తించేలా క్లయిమాక్స్ ఉండాలి, అదే విధంగా పార్ట్-1, ఏ మాత్రం తగ్గకుండా ఉండాలి. అందుకేనేమో కల్కి పార్ట్-1 కోసం ఏకంగా 3 క్లయిమాక్స్ రెడీ చేస్తున్నారు.
అవును.. ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమా మొదటి భాగాన్ని ఎలా ముగించాలనే అంశంపై ఇంకా డిస్కషన్లు సాగుతున్నాయంట. దీనికి సంబంధించి 3 రకాల క్లయిమాక్సులు అనుకున్నారట. ఏది ఫైనల్ చేస్తారో చూడాలి.
ప్రభాస్ సినిమాలకే ఎక్కువగా ఇలా జరుగుతోంది. బాహుబలి టైమ్ లో కూడా పార్ట్-1కు ముగింపునిచ్చే విషయంలో మల్లగుల్లాలు పడినట్టు రాజమౌళి గతంలో వెల్లడించాడు. ఇక తాజాగా వచ్చిన సలార్ పార్ట్-1 క్లయిమాక్స్ కోసం కూడా చాలా వర్క్ చేసినట్టు, 2-3 వెర్షన్లు రాసుకున్నట్టు ప్రశాంత్ నీల్ బయటపెట్టాడు. ఇప్పుడు కల్కి పార్ట్-1 కు కూడా ఈ మేథోమథనం తప్పడం లేదు.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది కల్కి సినిమా. కమల్ హాసన్ ఈ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడు. అతడి పాత్ర పరిచయంతోనే కల్కి పార్ట్-1 ముగుస్తుందని, అదే టైమ్ లో పురాణాలకు ముడిపెడుతూ, క్లయిమాక్స్ లో ట్విస్ట్ ఇస్తారని తెలుస్తోంది.