బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రిని కోల్పోయింది. ఆమె తండ్రి అనీల్ అరోరా మరణించారు. ఈరోజు ఉదయం ఆయన చనిపోగా, వయసురీత్యా కన్నుమూసి ఉంటారని అంతా అనుకున్నారు. కానీ తాజాగా అది ఆత్మహత్య అని ముంబయి పోలీసులు నిర్థారించారు.
తన ఇంటి టెర్రస్ పై నుంచి దూకి అనీల్ అరోరా ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆత్మహత్యకు కారణాలేంటనేది ప్రస్తుతానికి అస్పష్టం. మరణవార్త తెలిసిన వెంటనే మలైకా మాజీ భర్త అర్భాజ్ ఖాన్, మలైకా మాజీ బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మలైకా తండ్రి అనీల్ అరోరా, తల్లి జోయసీ పోలీకార్ప్ ది ప్రేమ వివాహం. జోయసీ మలయాళీ క్రిస్టియన్ కాగా.. అనీల్ అరోరా పంజాబీ హిందు. మర్చంట్ నేవీలో పనిచేస్తున్నప్పుడు ఇద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు.
అయితే మలైకా 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే వాళ్లు విడిపోయారు. అలా తల్లి, చెల్లి అమృతా అరోరాతో కలిసి చెంబూర్ కు షిఫ్ట్ అయింది మలైకా. అప్పట్నుంచి పిల్లల్ని తల్లి పోషించి పెద్దచేసింది.
2009లో అమృతా అరోరా, వ్యాపారవేత్త షకీల్ ను పెళ్లాడింది. వాళ్లకు ఇద్దరు అబ్బాయిలు. ఇక మలైకా అరోరా సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ను పెళ్లాడింది. వీళ్లకు ఒక కోడుకు. 19 ఏళ్లు కాపురం చేసిన తర్వాత మలైకా-అర్బాజ్ విడిపోయారు. ఆ తర్వాత హీరో అర్జున్ కపూర్ కు కనెక్ట్ అయింది మలైకా. తాజాగా అతడి నుంచి కూడా విడిపోయింది.
vc available 9380537747
Very sad rip