అనిరుధ్ పై కొరటాల అసంతృప్తి?

దర్శకుడు కొరటాల దగ్గర ప్రస్తావిస్తే, ఏం చేస్తాం అలాంటి పాట ఇచ్చాడు అని నిర్లిప్తంగా అనేసి ఊరుకున్నారని తెలుస్తోంది.

కోరి కోరి పెద్ద మ్యూజిక్ డైరక్టర్ ను తెచ్చుకున్న తరువాత ఏమీ మాట్లాడడానికి వుండదు ఇక. సరైన సంగీతం అందిస్తే హమ్మయ్య అని అనుకోవడం. లేదంటే నిట్టూర్చడం. అనిరుధ్ మంచి సంగీత దర్శకుడు. అందులో సందేహం లేదు. కానీ అతగాడు తమిళ సినిమాలకు ఇచ్చిన రేంజ్‌ మ్యూజిక్ ఎందుకో తెలుగు సినిమాలకు అందించలేకపోతున్నాడు.

ఇప్పటికీ అజ్ఞాతవాసి కి ఇచ్చిన పాటలే ది బెస్ట్. తరువాత కొంతలో కొంత గ్యాంగ్ లీడర్. లేటెస్ట్ గా దేవర సినిమాకు కూడా రెండు మంచి పాటలు ఇచ్చాడు. హీరోయిజం సాంగ్ కానీ, ఒక డ్యూయట్ కానీ మంచి పాపులర్ అయ్యాయి. కానీ మూడో పాట మాత్రం జ‌నాలకు పెద్దగా నచ్చలేదు. ఇంకా అయుధ పూజ‌ సాంగ్ వుంది. అది సూపర్ గా వుంటుందనే టాక్ వుంది.

ఇదిలా వుంటే దావూదీ పాట విషయంలో ఇటు ఫ్యాన్స్ నుంచే కాదు, అందరి నుంచీ నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. దాంతో పాటను తీసుకెళ్లి రోలింగ్ టైటిల్స్ మీదకు మార్చేసారు. ఈ విషయంలో సన్నిహితులు దర్శకుడు కొరటాల దగ్గర ప్రస్తావిస్తే, ఏం చేస్తాం అలాంటి పాట ఇచ్చాడు అని నిర్లిప్తంగా అనేసి ఊరుకున్నారని తెలుస్తోంది.

ట్రయిలర్ లో నేపథ్య సంగీతం మరీ అత్యద్భుతం కాదు కానీ ఓకె. అయితే ఈ జ‌నరేషన్ కోరుకునే కొత్త కొత్త సిగ్నేచర్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ సినిమాలో వుంటుందేమో చూడాలి. అలా వుంటే సినిమాకు మ్యూజిక్ పెద్ద హెల్ప్ అవుతుంది.

13 Replies to “అనిరుధ్ పై కొరటాల అసంతృప్తి?”

  1. ఆచార్య డిసాస్టర్ తరువాత కూడా కొరటాల శివ సినిమా తీసాడంటేనే ప్రేక్షకుల పైన ఎంత పగతో ఉన్నాడో, ప్రేక్షకులంటే ఎంతగా ఎర్రిపప్పలని భావిస్తున్నాడని అర్ధమైపోతోంది.

    కానీ దర్శకుడికి తెలీకుండా ట్రైలర్లో నేపథ్య సంగీతం పెట్టాడని అనుకునేంత ఎర్రిపప్పలు కాదు.

    సినిమాలో విషయం లేదు అని ప్రేక్షకులు డిసైడ్ అయిపోయారు, అది ఒప్పుకోలేకనే ఈ కవరింగ్…

  2. Asalu ee chiru ento. Devara lo kuda kaallu vellu pettesaru.

    P.S. For those who didn’t understand. Acharya time lo kelikesaru. Koratalani Pani cheyyanivvaledu annaru. Ee movie lo kuda trailer varaku same camera shots, same ambiance. Ante chiranjeevi idi kuda kelikesara?

Comments are closed.