ప్రమాదం నుంచి బయటపడిన హీరో

తమిళ నటుడు జీవా రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ప్రమాదం జరిగినప్పుడు అతడితో పాటు భార్య సుప్రియ కూడా ఉన్నారు. ఇద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. Advertisement చెన్నై-సేలం జాతీయ రహదారిపై వెళ్తుండగా..…

తమిళ నటుడు జీవా రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ప్రమాదం జరిగినప్పుడు అతడితో పాటు భార్య సుప్రియ కూడా ఉన్నారు. ఇద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

చెన్నై-సేలం జాతీయ రహదారిపై వెళ్తుండగా.. చిన్న సేలం వద్ద జీవా ప్రయాణిస్తున్న లగ్జరీ కారుకు ఎదురుగా ద్విచక్రవాహనం వచ్చింది. దాన్ని తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి నేరుగా వెళ్లి హైవేపై ఉన్న బారికేడ్ ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో జీవా కారు ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. జీవా, అతడి భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ట్రాఫిక్ క్లియర్ చేశారు. జీవా, తన భార్యతో కలిసి వేరే కారులో అక్కడ్నుంచి వెళ్లిపోయాడు.

తెలుగులో చివరిసారి యాత్ర-2లో కనిపించాడు జీవా. అతడు నటించిన బ్లాక్ సినిమా విడుదలకు సిద్ధమైంది.

One Reply to “ప్రమాదం నుంచి బయటపడిన హీరో”

Comments are closed.