హీరోహీరోయిన్ల రోజువారీ దినచర్య ఎలా ఉంటుందనే ఆసక్తి అందర్లో ఉంటుంది. మరీ ముఖ్యంగా స్టార్ హీరోయిన్ల విషయంలో ఈ ఇంట్రెస్ట్ ఇంకాస్త ఎక్కువ. బహుశా అందుకేనేమో.. ప్రస్తుతం తను ఒక రోజంతా ఏం చేస్తుందో వివరంగా చెప్పుకొచ్చింది సమంత.
పొద్దున్నే 6 గంటలకు నిద్రలేస్తుంది. లేలేత ఎండను ఆస్వాదిస్తూ, ఆరుబయట వ్యాయామం, సూర్యనమస్కారం లాంటివి చేస్తుంది. ఆ తర్వాత 10 నిమిషాలు అయిల్ పుల్లింగ్, మరో 10 నిమిషాలు హెయిర్ కేర్ రొటీన్ ఉంటుంది.
7 గంటలకు ఇండోర్ జిమ్ కు చేరుకుంటుంది. గంటపాటు ట్రయినర్ పర్యవేక్షణలో వర్కవుట్స్ చేస్తుంది. ఆ తర్వాత స్నానం చేసి, పూజ చేస్తుంది. ఆ వెంటనే టిఫిన్ చేసి సెట్ కు వెళ్తుంది. ఈ గ్యాప్ లో కారులో కళ్ల సంరక్షణ కోసం మసాజ్ లాంటివి చేస్తుంది.
ఇక మేకప్ వేసుకునే ముందు ముఖానికి ఐస్ థెరపీ చేసుకుంటుంది సమంత. మేకప్ వేసుకున్న తర్వాత ఇక సాయంత్రం వరకు ఆరోజు షూటింగ్ వ్యవహారమే. నిన్నంతా ఆమె ఓ ఫొటోషూట్ లో పాల్గొంది.
సాయంత్రం 6 గంటలకు రెడ్ లైట్ థెరపీ తీసుకుంటుంది. మయొసైటస్ సైడ్ ఎఫెక్టుల నుంచి కోలుకునే క్రమంలో ఈ థెరపీ ప్రారంభించింది సమంత. అదొక గంటసేపు ఉంటుంది. ఆ తర్వాత మరో గంట పాటు పికెల్ బాల్ ప్రాక్టీస్ చేస్తుంది. ఆమె ఈమధ్య పికెల్ బాల్ టోర్నమెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన సంగతి తెలిసిందే.
ప్రాక్టీస్ తర్వాత డిన్నర్ చేసి, ఓ అరగంట పాటు ధ్యానం చేసి, రాత్రి 10 గంటలకు నిద్రపోతుంది. ఇలా తన రోజు గడుస్తుందని సవివరంగా వెల్లడించింది సమంత. షూటింగ్, లొకేషన్ మారుతుందేమో కానీ, తన డెయిలీ రొటీన్ మాత్రం మారదని చెబుతోంది.
vc available 9380537747
‘సమంత రూత్ ప్రభు’ రోజూ ఉదయాన్నే పూజ చేస్తుందంటావ్
pooja ???or prayer ????
ఈ రెడ్ లైట్ థెరపీ ఎదో బాగుంది.
ఒక్కోసారి కేటీఆర్ ఫార్మ్ హౌస్ కి ,జగన్ రెడ్డి బెంగళూరు యెలహంక పాలస్ కి వెళ్లాల్సివస్తుంది కదా
Kadhu film studio ki shooting
Ayaa kasuu nuvvu kavalante sree reddy dhagarki vellu andharu neelagee vundaru
“డిన్నర్ చేసి, ఓ అరగంట పాటు ధ్యానం చేసి, రాత్రి 10 గంటలకు నిద్రపోతుంది”
Generally people go for subtle walks post food. She choses meditation?
Adeppudu mari
ఓ అరగంట పాటు ధ్యానం చేసి 🙂