సుధీర్ బాబు తో ఇప్పటికి రెండు సార్లు సినిమాలు చేసారు దర్శకుడు ఇంద్రగంటి. గతంలో సమ్మోహనం, వి సినిమాలు రెండింటిలో సుధీర్ బాబు హీరోగా నటించాడు. మళ్లీ మరోసారి అదే కాంబినేషన్ ను రిపీట్ చేయబోతున్నారు.
వి సినిమా తరువాత నాగ్ చైతన్యతో సినిమా చేయాల్సి వుంది. కానీ ఇంద్రగంటికి చైతూ ఒకె చెప్పారు కానీ ఇప్పట్లో కాదు. 2021 ఆఖరులో. ఈ లోగా చైతూ రెండు సినిమాలు చేస్తాడు. అదీ ప్లాన్.
ఈలోగా ఓ చిన్న సినిమా చేయాలని ఇంద్రగంటి డిసైడ్ అయిపోయారు. సుధీర్ బాబు సరసన ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టిని తీసుకుంటారని బోగట్టా. ఈ చిన్న సినిమాను చేసి, ఆపై చైతూ కోసం స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో వుంటారు ఇంద్రగంటి.
అయితే ఈ చిన్న సినిమాను ఏ నిర్మాతకు చేస్తున్నారన్నది ఇంకా తెలియలేదు. మైత్రీకి, సాహు గారపాటికి సినిమాలుచేయాలి. సాహు గారపాటికి చైతూ కాంబినేషన్ లో సినిమా వుంటుంది. అందువల్ల ఈ చిన్న సినిమాను మైత్రీకి చేస్తారేమో?