ఒకప్పుడు తమిళ సినిమాలకు మన దగ్గర మాంచి క్రేజ్ వుండేది. గట్టి దెబ్బలు తిన్న తరువాత వాటికేసి మన బయ్యర్ల చూడడం మానేసారు. దాంతో అక్కడి నిర్మాతలు కనీసం పంపిణీ చేసి పెట్టండి చాలు అంటూ మన వాళ్ల వెనుక పడడం ప్రారంభించారు.
ఇలాంటి నేపథ్యంలో కమల్ హాసన్ విక్రమ్ సినిమా హిట్ కొట్టింది. నిజానికి అలా హిట్ కొట్టడం వెనుక కూడా చాలా మంది ఆ సినిమాను తక్కవకు బేరాలాడి వదిలేసుకున్నారు.
టాగోర్ మధు, ఆస్ట్రేలియా వెంకట్, వెంకటరత్నం, నితిన్ తండ్రి సుధాకర రెడ్టి కలిసి కొన్నారు. మంచి లాభాలు కళ్ల చూసారు. దాంతో ఇప్పుడు అందరి దృష్టి రాబోయే భారీ తమిళ సినిమాల మీద పడింది.
కార్తీ నటించిన సర్దార్ సినిమా ముందుగా దొరికింది. అన్నపూర్ణ సంస్థ ఆరు కోట్లకు కాస్త అటు ఇటుగా హక్కులు తీసుకుంది. సినిమా ఏమాత్రం బాగున్నా మంచి డబ్బులు కళ్ల చూసే అవకాశం వుంది.
ఇదిలా వుంటే విక్రమ్ నటించిన కోబ్రా సినిమా బేరాలు కూడా మొదలయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి. లక్ష్మీ గణపతి ఫిలింస్ అలాగే మరో సంస్థ కూడా ఈ హక్కుల కోసం ప్రయత్నిస్తున్నాయని తెలుస్తోంది.