Advertisement

Advertisement


Home > Movies - Movie News

మళ్లీ పర్సంటేజ్ రగడ

మళ్లీ పర్సంటేజ్ రగడ

టాలీవుడ్ థియేటర్లలో మళ్లీ పర్సంటేజ్ ల రగడ ప్రారంభం కాబోతోంది. రెంటల్ సిస్టమ్ కిట్టుబాటు కావడం లేదని, పర్సంటేజ్ ల మీద సినిమాలు ఆడాలని తెలంగాణ ఎగ్జిబిటర్లు భావిస్తున్నారు. 

కరోనా రెండో దశ ముగుస్తున్న నేపథ్యంలో థియేటర్లు తెరవాలంటే తమ సమస్యలు పరిష్కరించాల్సిందే అని ఎగ్జిబిటర్లు పట్టుపట్టబోతున్నారు. ఇప్పటికే ఓసారి సమావేశమైన ఎగ్జిబిటర్లు ఈరోజు లేదా రేపు సమావేశం కాబోతున్నారు. 

ప్రోపర్టీ టాక్స్, కరెంట్ బిల్లులు వంటి వ్యవహారాల మీద ప్రభుత్వానికి వినతి పత్రం ఇస్తారు. అది అలా వుండగా సినిమాలను బట్టి పర్సంటేజ్ లు నిర్ణయించే విధంగా ఓ టేబుల్ కు రూపకల్పన చేసే ఆలోచనలో వున్నారు.

భారీ, పెద్ద సినిమాలకు ఓ పర్సంటేజ్, మిగిలిన మిడ్ రేంజ్, ఇంకా చిన్న సినిమాలకు ఓ పర్సంటేజ్ అన్న విధానం అయితే అన్ని వర్గాలకు బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారు.

అయితే ఆ టేబుల్ ఎలా? పెద్ద సినిమాలు అంటే ఏవి? చిన్న, మీడియం సినిమాలు అంటే ఏవి? అని విభజనపై మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రభుత్వం ఓకె అన్నా ఇప్పటికిప్పుడు థియేటర్లు తెరిచినా, సరిపడా సినిమాలు ఏవీ లేవు. అందువల్ల ఈ డిమాండ్లు సాధించుకున్న తరువాతే థియేటర్లు తెరిస్తే బెటర్ అని ఎగ్జిబిటర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?