Advertisement

Advertisement


Home > Movies - Movie News

మళ్లీ యాభైశాతం అంటే..అమ్మో..

మళ్లీ యాభైశాతం అంటే..అమ్మో..

థియేటర్లలో మళ్లీ యాభై శాతం టికెట్ లు మాత్రమే అమ్మే రూల్ వస్తుందా అన్న భయం టాలీవుడ్ లో మొదలైంది. కొత్త వైరస్ తలెత్తిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల అంక్షలు విధిస్తున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో థియేటర్ల పై కూడా అంక్షలు తప్పవని వార్తలు వినిపించడం ప్రారంభమైంది. అయితే ఇది ఇమ్మీడియట్ గా ఙరుతుందా, ఙరగదా అన్నది పక్కన పెడితే, అదే ఙరిగితే టాలీవుడ్ చాలా కష్టాల్లో కూరుకుపోతుంది.

కరోనా రెండు ఫేఙ్ ల కారణంగా పలు భారీ సినిమాలు అలా వెనక్కు వెనక్కు ఙరిగి 2022 లోకి వచ్చాయి. ఇప్పుడు మళ్లీ అంక్షలు అంటే అవన్నీ పూర్తిగా కష్టాల్లో కూరుకుపోతాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, నార్త్ లో అంక్షలు విధించినా తెలుగు సినిమాలు కష్టాల్లో కూరుకుపోతాయి. 

ఎందుకంటే రాబోయే మూడు నాలుగు నెలల్లో విడుదల కాబోయే సినిమాలు అన్నీ పాన్ ఇండియా సినిమాలే. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మరే రాష్ట్రంలో అంక్షలు విధించినా సమస్యే అవుతుంది. దాదాపు సినిమాల విడుదల నిలిచిపోయే ప్రమాదం వుంటుంది. ముఖ్యంగా రాధేశ్యామ్, అర్అర్అర్ సినిమాలు దాదాపు నిలిచిపోతుంది. 

ఇవన్నీ ఇలా వుంచితే అంక్షలు విధించినా, విధించకున్నా ఙనం థియేటర్ కు రావడానికి భయపడతారు. అది మరీ ప్రమాదకరం. మొత్తం మీద కొత్త వైరస్ టాలీవుడ్ ను కబళించేలా కనిపిస్తోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?