మామయ్య ఆర్డరేసారు. మేనల్లుడిని మూడు నెలలు మరే సినిమా మీదకు వెళ్లడానికి వీలు లేదని. తన సినిమా మీదే వుండాలని. జూలై రెండో వారం నుంచి మొదలు కాబోతోంది పవన్ కళ్యాణ్ కొత్త సినిమా.
సముద్రఖని డైరక్షన్ లో వినోద సహితం రీమేక్. ఒరిజినల్ స్క్రిప్ట్ ను సమూలంగా మార్చి కొత్త స్క్రిప్ట్ ను అందించారు త్రివిక్రమ్. దీనికి మాటలు అందిస్తున్నారు బుర్రా. ఆ స్క్రిప్ట్ ప్రకారం పెరిగిన క్యారెక్టర్ ను చేస్తున్నారు సాయి ధరమ్ తేజ్. ఆయన సరసన కృతికా శర్మ.
కట్ చేస్తే ఈ సినిమా కోసం మూడు నెలలు మరే సినిమా సెట్ మీదకు వెళ్ల వద్దని పవన్ కళ్యాణ్ తన మేనల్లుడిని ఆదేశించినట్లు బోగట్టా. ఈ సినిమా కోసం పవన్ ముఫై కాల్ షీట్లు కేటాయించారు.
డిసెంబర్ లోగా ఈ సినిమా రెడీ అయిపోయి సంక్రాంతికి విడుదల చేయాలన్నది ప్లాన్. దసరా నుంచి పవన్ పొలిటికల్ టూర్ కు వెళ్లిపోతున్నారు. ఆ లోగా ఆయన చేయాల్సిన పార్ట్ పూర్తి చేస్తారు. ఇందులో సగం గ్రీన్ మ్యాట్ మీదే వుంటుంది.
ఫైట్లు డ్యాన్స్ లు లేకుండానే, సింపుల్ గా ముఫై రోజుల వర్క్ కు పవన్ కు పారితోషికం అందుతుంది. అది యాభై కోట్లా..అరవై కోట్లా అన్నది ఆయనకు, నిర్మాతకే తెలియాలి. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ సినిమా ఒకటి సెట్ మీద వుంది. అది ఆపేసి ఈ సినిమా మీదకు రావాలి. తప్పదు మామయ్య ఆర్డర్ కదా?