బీసీలు అంటే మేమే. మా కంటే పెద్ద బీసీలు ఉన్నారా అని టీడీపీ నేతలు తరచూ చెబుతూ ఉంటారు. మరి బీసీలు అంతా అక్కడికీ వారి పార్టీలోనే ఉన్నట్లుగా బిల్డప్ ఇస్తారు. అలాగే బీసీలు అంతా టీడీపీకే ఓటేయాలని కూడా అంటూ ఉంటారు.
ఇవన్నీ పక్కన పెడితే ఉమ్మడి విశాఖలో టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి గోడను కూల్చితే దానికి కూదా బీసీ కార్డు తీసి మరీ టీడీపీ రాజకీనం చేయడం పట్ల ఇపుడు విమర్శలు వస్తున్నాయి. అయ్యన్న పంట కాలువ మీద తన ఇల్లు కట్టారని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెబుతోంది. ఆ విషయం మీద ఆధారాలు ఉన్నాయని అంటోంది.
ముందు అయ్యన్న కట్టిన ఇల్లులో ప్రభుత్వ జాగా ఉందా లేదా అన్నది తేలాల్సి ఉంది. విషయం అది అయితే బీసీల మీద దాడి చేస్తారా ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యలు అంటూ అయ్యన్న సతీమణి మాట్లాడడం మొదలుపెడితే ఇపుడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు సహా అంతా దాన్ని అందుకున్నారు. ఇది బీసీల మీద జరిగిన దాడిగా ఇపుడు కలరింగ్ ఇస్తున్నారు.
మరి వైసీపీ వైపున ఉన్న వారు కూడా బీసీలే కదా. స్వయంగా అయ్యన్నను ఓడించినది కూడా బీసీ నేత అయిన పెట్ల ఉమా శంకర్ గణేష్ కాదా అని ప్రశ్నిస్తున్నారు. తప్పు జరిగితే దాన్ని ఒప్పుకోవాలి. లేక మా తప్పు లేదని గట్టిగా చెప్పాలి కానీ మధ్యలో బీసీ కార్డుని తీసి రాజకీయం చేయడమేంటి అని వైసీపీ నేతలు అంటున్నారు.
చలో నర్శీపట్నం, చలో బీసీ అంటూ టీడీపీ ఇస్తున్న పిలుపులు రాజకీయ విపరీతాలుగానే చూడాలి అంటున్నారు.