Advertisement

Advertisement


Home > Movies - Movie News

మానాడు ముందుగా హిందీలోనే

మానాడు ముందుగా హిందీలోనే

తమిళంలో పెద్ద హిట్ అయిన సినిమా మానాడు. ఈ సినిమా తెలుగు హక్కులు రానా దగ్గర వున్నాయి. ఎప్పటికి తీస్తారు అన్నది జవాబు రావడం లేని ప్రశ్న అవుతోంది. ఈ సినిమా కాస్టింగ్ విషయంలో రకరకాల పేర్లు వినిపించాయి. 

ఇది మల్టీ స్టారర్ గా వస్తుంది కనుక రానా ఒక హీరోగా, మరో పాత్రకు పెద్ద హీరోలు ఎవరినైనా తీసుకుంటారని అనుకున్నారు. ఒక దశలో రవితేజ పేరు కూడా వినిపించింది. కానీ ఇప్పటికీ ఏదీ ఫైనల్ కాలేదు.

విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో తీయడం లేదు. ముందుగా హిందీలోనే తీస్తారు. ఓ పాత్రను రానా చేస్తారు. మరోపాత్ర కు హిందీ హీరోను తీసుకుంటారు. సినిమా నిర్మాణం పూర్తయిన తరువాత ఆ వెర్షన్ నే తెలుగులో విడుదల చేయడమా? లేక తెలుగుకు మళ్లీ సెపరేట్ గా మరో హీరోతో చేయడమా అన్నది డిసైడ్ చేసుకుంటారు.

ప్రస్తుతానికి ఇంకా చాలా ఎర్లీ స్టేజ్ లో వుందీ సినిమా. కాస్టింగ్, టెక్నికల్ కాస్టింగ్, ఇలా అన్నీ వన్ బై వన్ డిసైడ్ కావాలి. ప్రొడక్షన్ స్టార్ట్ కావాలి. అంతా రానా నే చూసుకుంటున్నారు. ఆయన ఎక్కువగా ముంబైలోనే వుంటారు కనుక, అన్నీ రానా నే డిసైడ్ చేస్తారని తెలుస్తోంది.

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా