గంటా బ్యాక్ సీటు…బాబు మారిపోయారా…?

చంద్రబాబు నిజమైన రాజకీయ నాయకుడు అని అంతా చెప్పుకుంటారు. ఆయన లక్ష్యాన్ని చూస్తారు తప్ప తన గురించి ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోరు అని అంటారు. చంద్రబాబులో మరో లక్షణం ఉంది. ఆయన…

చంద్రబాబు నిజమైన రాజకీయ నాయకుడు అని అంతా చెప్పుకుంటారు. ఆయన లక్ష్యాన్ని చూస్తారు తప్ప తన గురించి ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోరు అని అంటారు. చంద్రబాబులో మరో లక్షణం ఉంది. ఆయన పార్టీని ఎవరైనా వదిలేసి వెళ్ళినా లేక పార్టీని పట్టించుకోకుండా వ్యవహరించినా వారికి బలం ఉంది అంటే చాలు టికెట్ ఇస్తారు.

అలా రాజకీయమే ముఖ్యం అనుకుని చంద్రబాబు వ్యవహరించడం వల్ల పార్టీలో చాలా మంది అధినాయకత్వం ఆదేశాలను తేలిగ్గా తీసుకుంటారు అన్న విమర్శలు ఉన్నాయి. అయితే చంద్రబాబు తాను మారాను ఈసారి పనిచేసే వారికే పెద్ద పీట అని చాలా కాలంగా చెబుతూ వస్తున్నారు.

ఇపుడు అది ఆచరణలో పెడుతున్నట్లుగా ఉంది. మాజీ మంత్రి విశాఖ జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు రాజమండ్రిలో జరిగే మహానాడుకు హాజరయ్యారు. అయితే గంటాకు మునుపటి విధంగా పార్టీలో జరగడంలేదా అన్న డౌట్లు వస్తున్నాయి. ఆయన వేదిక మీద చివరి వరసలో కూర్చున్నారు.

ఆయన కంటే జూనియర్లు అంతా ముందు వరసలో ఉన్నారు. వేదిక మీద మొదటి వరసలో చంద్రబాబుతో సరిసమానంగా ఇతర నేతలు ఉంటే టీడీపీలో పాతికేళ్ళుగా అనుబంధం ఉన్న గంటా మాత్రం బ్యాక్ బెంచ్ కి వెళ్ళిపోయారు. దీన్ని చూసిన వారు చంద్రబాబు ఆయన్ని పట్టించుకోవడం లేదా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

విశాఖలో ఈ మధ్య జరిగిన సభలలో సైతం గంటా హడావుడి పెద్దగా కనిపించలేదు. బాబు ఆయన కంటే జూనియర్లను పొగుడుతూ గంటాను మాత్రం పక్కన పెడుతున్నారు అని అంటున్నారు. గంటా అంటే ఒకనాడు టీడీపీలో కీలకంగా ఉండేవారు. అలాంటి ఆయన 2019లో పార్టీ ఓడాక నాలుగేళ్ల పాటు సైలెంట్ గా ఉండిపోవడం జరిగింది

ఆయన వైసీపీలో జనసేనలో చేరుతారు అన్న ప్రచారం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో సొంత డెసిషన్ తీసుకుని ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, ఇవన్నీ కూడా ఇపుడు టీడీపీలో ఆయన పూర్వ వైభవానికి అడ్డంకింగా మారుతున్నాయని అంటున్నారు.