ప్యాకేజి కోసం మోయ‌డం కాదు.. ప‌వ‌న్ కు అంబ‌టి క్లాస్!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భలే సరదా మనిషి త‌న రాజకీయ ప్రసంగాలలో ఒక్కొక్కసారి తనకు తానే సెటైర్ వేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు.. అలాంటిదే సీఎం జగన్ పై ఏదో కార్టూన్ తో విమర్శించాలని…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భలే సరదా మనిషి త‌న రాజకీయ ప్రసంగాలలో ఒక్కొక్కసారి తనకు తానే సెటైర్ వేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు.. అలాంటిదే సీఎం జగన్ పై ఏదో కార్టూన్ తో విమర్శించాలని చూసి తీరా అది తనకే సంబంధించింది అని తెలియ‌డంతో ప‌వ‌న్ కళ్యాణ్ నవ్వుల పాలవుతున్నారు. అందులోను త‌న అత్యంత ప్రియ విరోధిగా భావించే మంత్రి అంబటి రాంబాబు ఫొటో ఉండ‌టంతో అంబ‌టి సెటైర్ కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ నవ్వులపాలవుతున్నారు.  

పార్టీ పెట్టి దాదాపు పది సంవత్సరాలు అవుతున్నా పార్టీని పట్టించుకోకుండా కేవలం చంద్రబాబు నాయుడు రాజకీయం కోసం మాత్రమే పార్టీ నడుపుతున్నా పవన్ కళ్యాణ్.. వైసీపీ నేతలు జగన్ ను పల్లకిలో తీసుకువెళ్తున్న కార్టూన్ వేసి విమ‌ర్శించాల‌ని చూస్తే దానికి మంత్రి అంబటి రాంబాబు ప‌వ‌న్ పై సెటైర్ వేశారు.  'మా నాయకుడినే మోస్తాం !.. ప్యాకేజి కోసం పక్క నాయకుడిని కాదు!' అంటూ ఎద్దేవా చేశారు. చంద్ర‌బాబు ప‌ల్ల‌కిని ప‌వ‌న్ క‌ళ్యాణ్ మోస్తున్న విష‌యాన్ని మంత్రి అంబ‌టి గుర్తు చేశారు.

ప‌వ‌న్ కార్టూన్ పై నెటిజ‌న్లు కూడా ట్రోల్స్ చేస్తున్నారు. చంద్ర‌బాబును సీఎం చేయ‌డం కోసం మాత్ర‌మే తాను పార్టీ న‌డుపుతున్న‌ట్లు స్వ‌యంగా ప్ర‌క‌టించుకున్నా ప‌వ‌న్ ఇలా కార్టూన్ లో ప‌ల్ల‌కి పైనా చంద్ర‌బాబు మోస్తున్న జ‌నాలుగా ప‌వ‌న్ అండ్ కో పెట్టి ఉంటే బాగుండేద‌ని స‌ల‌హాలు ఇస్తున్నారు. ఎవ‌రైనా రాజ‌కీయాల్లోకి ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డానికి వ‌స్తారు కానీ ప‌క్క పార్టీ వారి సేవ కోసం రాజ‌కీయాల్లోకి రావ‌డం చరిత్ర‌లో బ‌హుశా ప‌వ‌న్ క‌ళ్యాణ్ నే కావ‌చ్చు అంటూ ఎద్దేవా చేస్తున్నారు.