
చంద్రబాబునాయుడు తదితర ఎన్టీఆర్ వెన్నుపోటుదారులతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ వేదిక పంచుకోకపోవడానికి కారణం ఏంటో దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన స్టైల్‌లో విశ్లేషించారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడవడంపై వర్మ సంచలన కామెంట్స్ చేశారు. వర్మ కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. విజయవాడలో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఆదివారం జరిగాయి.
ఈ సభలో రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొనడానికి రాలేదని రాంగోపాల్ వర్మ చెప్పారు. కేవలం ఒక సీరియస్ జోక్ చెప్పడానికి మాత్రమే వచ్చానని ఆయన అన్నారు. ఎవరూ నవ్వలేని ఆ జోక్ ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతోందన్నారు. అది ఎంత పెద్ద జోక్ అంటే స్వర్గంలో ఉన్న ఎన్టీ రామారావు నవ్వాలో, ఏడ్వాలో తెలియని జోక్ అని వ్యంగ్యంగా అన్నారు. చరిత్రలో నమ్మడం వల్ల వెన్నుపోటుకు గురైన వాళ్ల గురించి విన్నామని ఉదాహరణ చెప్పారు.
నందమూరి తారక రామారావును చంపినవాళ్లే ఇప్పుడు రక్తం తుడుచుకుని వచ్చి అభిషేకాలు చేస్తుంటే అంతకన్నా పెద్ద జోక్ మరొకటి లేదన్నారాయన. ఇక్కడ ఇంటి అల్లుడు అయిన వ్యక్తి(చంద్రబాబు) ఎన్టీఆర్‌ను దారుణంగా టార్చర్ చేసి ఏడిపించి ఏడిపించి చంపారని చెప్పుకొచ్చారు. మళ్లీ ఇప్పుడు ఆయనే దండలు వేయడం జోక్‌గా అభివర్ణించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవడంపై సీబీఐ ఇన్వెస్టిగేషన్, అలాగే నేరపరిశోధక జర్నలిస్టులు ఏమీ చేయాల్సిన పనిలేదన్నారు.
ఎందుకంటే చంద్రబాబు గురించి ఎన్టీఆరే చెప్పారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో ఆ మహానుభావుడికి సేవలు చేసిన లక్ష్మీపార్వతి లేరన్నారు. చాలా మంది పెద్దలు ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించినట్టు లేరన్నారు. ఎన్టీఆర్.. లక్ష్మీపార్వతి మాయలో పడ్డారంటున్నారు.. అంటే ఆయనకు బుర్ర లేదనా మీరు చెప్పేది అని ఆయన ప్రశ్నించారు. ఒక సీఎం స్థాయి వ్యక్తి లక్ష్మీపార్వతి మాయలో పడ్డారని అనుకుంటే ఆయనకు ఎందుకు దండలు వేస్తున్నారు? ఫొటోలు పెట్టి ఎందుకు పూజిస్తున్నారని ఆర్జీవీ నిలదీశారు.
మీరు చెబుతున్న దానిపై నిలబడాలని ఆర్జీవీ హితవు చెప్పారు. టాలీవుడ్ సూపర్‌స్టార్ అయిన ఎన్టీఆర్‌ను వెన్నపోటు పొడిచిన చంద్రబాబు పక్కన కూర్చుని వాళ్లను మరో సూపర్‌స్టార్ రజనీకాంత్ పొగడటం అంటే ఆయన కూడా ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్లే! అని ఆర్జీవీ సంచలన కామెంట్ చేశారు.
ఈ మొత్తం ఎపిసోడ్‌లో నందమూరి తారకరామారావు ఫ్యామిలీలో ఉన్న ఒకే ఒక్క మగాడు జూనియర్ ఎన్టీఆర్ అని కితాబిచ్చారు. ఎందుకంటే అంత పెద్ద సూపర్‌స్టార్ కొడుకులు గానీ ఎవరూ తీసుకోని విధంగా తారక్ ఒక్కడే స్టాండ్ తీసుకున్నారని చెప్పారు. తారక్ ఒక్కడే తాతమీదున్న గౌరవంతో వాళ్లతో పాటు వేదిక పంచుకోలేదనేది తన అభిప్రాయంగా ఆయన చెప్పారు. అందుకు తారక్‌కు తాను ఎన్టీఆర్ అభిమానిగా థ్యాంక్స్ చెబుతున్నానన్నారు.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా