మే నాలుగున దర్శకుడు హరీష్ శంకర్ చాలా హుషారుగా ఓ ట్వీట్ వేసారు. మనల్ని ఎవడ్రా ఆపేది… ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రెండో షెడ్యూలు కు రెడీ అవుతున్నాం అంటూ ఈ ట్వీట్ వేసారు.
నిజానికి జరిగింది ఏమిటంటే, ఉస్తాద్ కు ఓ వారం రోజులు డేట్ లు ఇచ్చి, ఓ పని అయింది అనిపించుకున్నారు. మళ్లీ జూన్ లో రెండో షెడ్యూలు అన్నారు. కానీ అలాంటిది సడెన్ గా మే 15కు కాస్త అటుగా డేట్ లు ఇస్తానని కబురు వచ్చింది. దాంతో దర్శకుడు హరీష్ కు హుషారు ఆగలేదు.
ఫుల్ ఎనర్జిటిక్ గా వుండే హరీష్… రెండో షెడ్యూలుకు రెడీ..మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ ఓ ట్వీట్ వేసారు. సరే..ఆయన ఆనందం ఆయనది. కానీ ఇప్పుడేమయింది. 18 వ తేదీ వస్తోంది. కానీ రెండో షెడ్యూలు జాడ లేదు.
మరోపక్కన బ్రో సినిమాలో ఐటమ్ సాంగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 22 తరువాత ఏ రోజైనా పవన్ ఆ షూట్ లో జాయిన్ కావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే హరి హర వీరమల్లు కు సంబంధించి పాట కూడా పూర్తి చేసే ఆలోచనలో వున్నారు పవర్ స్టార్ అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
అంటే దీన్ని బట్టి ఉస్తాద్ రెండో షెడ్యూలు జూన్ లోనే అని అనుకోవాల్సిందే. కానీ…సపోజ్..ఫర్ సపోజ్..పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే ప్రకటించినట్లు జూన్ నుంచి జనాల్లోకి వెళ్తే.…’మనల్ని ఎవడ్రా ఆపేది’ అని ఆయన అనాల్సిందే కానీ హరీష్ అనలేరేమో?