రిలీజ్ కు ముందు సినిమాపై క్రేజ్ పెరగాలంటే కచ్చితంగా ఒక్క పాటైనా హిట్టవ్వాల్సిందే. సోషల్ మీడియాలో వైరల్ గా నిలవాల్సిందే. అలాంటిది 16 పాటలున్న సినిమాలో ఒక్క సాంగ్ అయినా క్లిక్ అవ్వకపోతే ఎలా?
శర్వానంద్ హీరోగా నటించిన సినిమా ‘మనమే’, ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది. ఇందులో ఏకంగా 16 పాటలున్నాయనే విషయాన్ని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఇప్పటికే బయటపెట్టాడు. తాజాగా సంగీత దర్శకుడు హేషమ్ కూడా ఇదే విషయాన్ని కన్ ఫర్మ్ చేశాడు.
మనమే సినిమాలో 16 సాంగ్స్ ఉన్నాయి. వీటిలో 11 స్ట్రయిట్ సాంగ్స్ కాగా, 5 బిట్ సాంగ్స్. సినిమా ఫస్టాఫ్ లోనే 10 పాటలొస్తాయంట. మిగతా సాంగ్స్ మలి భాగంలో వస్తాయంటున్నాడు. ఇన్ని పాటలున్న సినిమాలో కనీసం ఒక్క పాటైనా హిట్టయితే బాగుణ్ను.
ఈ సినిమా సాంగ్ ఒకటి 2 నెలల కిందటే రిలీజైంది. దానికి ఇప్పటివరకు వచ్చిన వ్యూస్ 3.5 మిలియన్. 11 రోజుల కిందట రిలీజైన పాటకు, 6 రోజుల కిందట వచ్చిన మరో పాటకు చెరో మిలియన్ వ్యూస్ ఉన్నాయి. ఈరోజు రాత్రికి లేదా రేపటికి టోటల్ జూక్ బాక్స్ వచ్చేస్తుంది.
థియేటర్ లో సాంగ్ వస్తే జనం బయటకెళ్లిపోయే ఈ రోజుల్లో ఇలా ఒకే సినిమాలో 16 సాంగ్స్ పెట్టడం పెద్ద సాహసమే. ఇంత సాహసం చేస్తున్నప్పుడు ఒక్కటైనా హిట్ నంబర్ ఉండేలా జాగ్రత్త తీసుకోవాల్సింది. ఆ మేజిక్ లేకుండానే థియేటర్లలోకి వస్తోంది ‘మనమే’.