పెళ్లయి, ఓ పిల్లాడికి తల్లి అయిన తర్వాత కూడా కాజల్ కు ఈ ప్రశ్నలు తప్పడం లేదు. ‘పెళ్లయిన హీరోయిన్’ అనే ట్యాగ్ లైన్ ను ఆమె భరించలేకపోతోంది. తన వృత్తికి, పెళ్లికి ఏంటి సంబంధం అని ప్రశ్నిస్తోంది.
“పెళ్లయ్యాక ఒక హీరోయిన్ కెరీర్ ఎందుకు మారాలో నాకైతే అర్థం కావడం లేదు. అందరికీ పర్సనల్ లైఫ్ ఉంది. అలాగే హీరోయిన్స్ కు కూడా. గతంలో పెళ్లయిన తర్వాత హీరోయిన్స్ కు అవకాశాలు తగ్గేవి. కానీ ఇప్పుడు కాలం మారింది. పెళ్లి తర్వాత కూడా ఎంతోమంది హీరోయిన్స్ అంతకుముందు కంటే బిజీగా సినిమాలు చేస్తున్నారు. నేనేందుకు చేయకూడదు.”
ఇలా తన అసహనాన్ని వ్యక్తం చేసింది కాజల్. ప్రస్తుతం తను ఫ్యామిలీ లైఫ్ ను, వర్క్ లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకుంటున్నానని, ఈ విషయంలో తన కుటుంబం నుంచి తనకు పూర్తి మద్దతు లభిస్తోందని వెల్లడించింది.
సత్యభామ సినిమాతో తొలిసారి యాక్షన్ జానర్ లోకి ఎంటరైంది కాజల్. ఈ సినిమా రిలీజ్ తర్వాత తనను అంతా చందమామ అని కాకుండా, సత్యభామ అని పిలుస్తారని అంటోంది. అయితే తనకు ఈ రెండు బిరుదులు ఇష్టమేనని అంటోంది.