టాలీవుడ్ నటుడు మంచు మనోజ్- భూమా మౌనిక రెడ్డిల పెళ్లి సందడి మొదలైంది. ఈ రోజు రాత్రి 8.30నిమిషాలకు మంచి లక్ష్మీ ప్రసన్న ఇంట్లో వారి వివాహ వేడుక జరగునుంది. మంచు లక్ష్మీ పెళ్లి కార్యక్రమాలన్నింటినీ దగ్గరుండి చూసుకుంటున్నారు. మెహందీకి సంబంధించిన ఫోటోలను మంచు లక్ష్మీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది.
ఈ రోజు సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నట్లు సమాచారం. మనోజ్ చివరగా 2017లో ఒక్కడు మిగిలాడు సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. అప్పట్నుంచి మంచు మనోజ్ సినిమాలకు దూరంగానే ఉన్నాడు.
కాగా మనోజ్, మౌనిక ఇద్దరికీ ఇది రెండో వివాహం కావడం గమనార్హం. వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరి తొలి వైవాహిక జీవితాలు అంత సాఫీగా సాగలేదు. మొదటి భార్యతో విడాకులు తీసుకున్న మనోజ్.. రెండో పెళ్లికి రెడీ అయ్యారు.