అల్లు అర్జున్ తో ఐకాన్ సినిమా ప్రకటించి చాలా కాలం అయింది. ఆ ప్రాజెక్టు ఆగిపోయిందని వార్తలు రావడం, లేదు వుందని నిర్మాత దిల్ రాజు అంటూ వుండడం కామన్ అయిపోయింది. ఆ సినిమా చేయాల్సిన దర్శకుడు వేణు శ్రీరామ్ అటు తమిళ హీరోలు, ఇటు తెలుగు హీరో నాని వైపు చూస్తున్నారని వార్తలు కూడా వచ్చేసాయి.
ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో, 2025 ఎండ్ వరకు బన్నీ లైనప్ వచ్చేసింది. 2023 అంతా పుష్ప 2 సినిమా మీద, 2024 లో త్రివిక్రమ్ సినిమా, 2025లో సందీప్ వంగా సినిమా ఫిక్స్ అయిపోయాయి.
ఇక దిల్ రాజుకు డేట్స్ ఇవ్వాలి అంటే శంకర్ డైరక్షన్ నే ఓన్లీ ఆప్షన్. శంకర్ మరో సినిమా కూడా దిల్ రాజుకే కమిట్ అయ్యారని వార్తలు వున్నాయి. వేణు శ్రీరామ్ ..ఐకాన్ అన్నది ఇక మరిచిపోవచ్చు. దిల్ రాజుకు బన్నీ సినిమా చేయాలంటే శంకర్ రేంజ్ డైరక్టర్ కావాల్సి వుంటుంది.
అలా ఓకె అయినా కూడా 2026 లోనే. కానీ అప్పటి వరకు శంకర్ ఖాళీగా వుండరు కదా? అందువల్ల ఇప్పట్లో దిల్ రాజు-బన్నీ సినిమా అన్నది కష్టమే. పైగా ఈ మధ్యనే డైరక్టర్ పరుశురామ్ విషయంలో గీతా కాంపౌండ్ కు దిల్ రాజుకు మధ్య తేడా వచ్చింది. అది కూడా దృష్టిలో పెట్టుకుంటే ఇక దిల్ రాజు వేరే హీరోలను చూసుకోవాల్సిందేనేమో?