మారేడుమిల్లిలో నితిన్ ‘పుష్ప’?

హీరో స్మగ్లర్..గెడ్డంతో రఫ్ గెటప్ లో వుంటాడు…పైగా లారీ నడుపుతాడు..ఇలా చెప్పగానే జ‌నాలకు గుర్తు వచ్చేది పుష్ప సినిమానే. కానీ ఈ సంగతులు పుష్ప సినిమా గురించి కాదు. నితిన్ హీరోగా వక్కంతం వంశీ…

హీరో స్మగ్లర్..గెడ్డంతో రఫ్ గెటప్ లో వుంటాడు…పైగా లారీ నడుపుతాడు..ఇలా చెప్పగానే జ‌నాలకు గుర్తు వచ్చేది పుష్ప సినిమానే. కానీ ఈ సంగతులు పుష్ప సినిమా గురించి కాదు. నితిన్ హీరోగా వక్కంతం వంశీ తీస్తున్న సినిమా సంగతి. 

వక్కంతం కథల్లో అప్పటికే వచ్చేసిన సినిమా కథలు ఛాయలు వుంటాయన్న సంగతి తెలిసిందే. కిక్ లో జెంటిల్ మన్, నా పేరు సూర్యలో వజ్రం సినిమా గురుతులు వుంటాయి. ఇప్పుడు నితిన్ తో చేయబోతున్న సినిమాలో పుష్ప గురుతులు వుంటాయో, వుండవో కానీ ప్రస్తుతం మారేడుమిల్లిలో అలాంటి ఎపిసోడ్ నే చిత్రీకరిస్తున్నారు.

ఈ ఒక్క ఎపిసోడ్ నే ఇలా వుంటుందని, మిగిలిన సినిమా కథ వేరు అని తెలుస్తోంది. ఈ ఓక్క సీన్ కోసమే హీరో గెడ్డం పెంచాడని టాక్. మొత్తం మీద నితిన్ తో వక్కంతం వంశీ సినిమా మొదలైంది. జ‌స్ట్ కొద్ది రోజులు అడవుల్లో ఫస్ట్ షెడ్యూలు పూర్తి చేసి సినిమాను హైదరాబాద్ కు షిప్ట్ చేస్తారు. అక్కడి నుంచి వేరే లైన్ లో నడుస్తుంది. ఈ గెటప్..ఈ సీన్ కు, తరువాత కథకు లింక్ ఏమిటి అన్నది తెలియాల్సి వుంది.

హారిస్ జ‌యరాజ్ సంగీతం అందిస్తున్నారు. నితిన్ హోమ్ బ్యానర్ మీద ఈ సినిమా నిర్మిస్తున్నారు.