Advertisement

Advertisement


Home > Movies - Movie News

మరింత భారీగా పుష్ప 2

మరింత భారీగా పుష్ప 2

మొత్తానికి పుష్ప2 సినిమా మీద క్లారిటీ వస్తోంది. పుష్ప 2 వుంటుదనే మొదటి నుంచీ యూనిట్ చెబుతూ వస్తోంది. అయితే వుంటుందా? వుండదా? అనే అనుమానాలు వెన్నాడుతూనే వున్నాయి. అంతకన్నా కీలకం ఏమిటంటే హీరో బన్నీ కంటిన్యూగా పార్ట్ 2 చేస్తాడా? లేక వేరే ప్రాజెక్టు చేసి దీని మీదకు వస్తాడా? అన్న పాయింట్. 

విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం నార్త్ లో పుష్ప పార్ట్ వన్ కు వచ్చిన క్రేజ్ ను కంటిన్యూ చేయాలని, క్యాష్ చేసుకోవాలనే హీరో బన్నీ ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు డైరక్టర్ సుకుమార్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ హెల్డ్ అంత బాగా లేదని తెలుస్తోంది. 

వన్స్ సెటిల్ కాగానే టీమ్ తో ఎటన్నా వెళ్లి, స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తారని బోగట్టా.  పుష్ప నిర్మాతలకు తొలిభాగం నో లాస్..నో ప్రాఫిట్ గా మిగిలింది. అందువల్ల అంతకు అంతా రెండో భాగాన్ని క్యాష్ చేసుకోవాలి. ముఖ్యంగా నాన్ థియేటర్ హక్కుల రూపంలో మంచి అమౌంట్ రప్పించాలని డిసైడ్ అయ్యారు. 

తొలిభాగం నాన్ థియేటర్ రైట్స్ ముందుగా అమ్మడం సమస్య అయింది. అప్పటికీ డిజిటల్ రైట్స్  విషయంలో కాస్త మంచి మొత్తం సంపాదించారు. ఆంధ్రలో నష్టాలు కవర్ చేయడానికి అది సరిపోయింది.

ఈసారి నాన్ థియేటర్, మిగిలిన భాషల రేట్ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం ఎలాగూ తప్పదు. దాదాపు టెక్నికల్ టీమ్ అంతా అదే పని చేస్తుందని ఒకటి రెండు చిన్న చిన్న మార్పులు వుండే అవకాశం వుందని తెలుస్తోంది. నిర్మాణం మాత్రం తొలిభాగం కన్నా చాలా భారీగా వుంటుందని, విదేవీ లొకేషన్లు కూడా వుంటాయని వినిపిస్తోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?