మామా మశ్చీంద్ర బాటలో మార్క్ ఆంటోనీ

సినిమాలను ఓటీటీకి ఇచ్చే విషయంలో రూల్స్ పట్టించుకోవడం మానేసి చాలా రోజులైంది. నచ్చినట్టు ఒప్పందాలు చేసుకొని, ఓటీటీలకు తమ సినిమాల్ని ఇచ్చేస్తున్నారు  నిర్మాతలు. మొన్నటికిమొన్న మామా మశ్చీంద్ర విషయంలో ఏం జరిగిందో అందరం చూశాం.…

సినిమాలను ఓటీటీకి ఇచ్చే విషయంలో రూల్స్ పట్టించుకోవడం మానేసి చాలా రోజులైంది. నచ్చినట్టు ఒప్పందాలు చేసుకొని, ఓటీటీలకు తమ సినిమాల్ని ఇచ్చేస్తున్నారు  నిర్మాతలు. మొన్నటికిమొన్న మామా మశ్చీంద్ర విషయంలో ఏం జరిగిందో అందరం చూశాం. ఇప్పుడు మార్క్ ఆంటోనీ కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతోంది.

అయితే ఇక్కడో చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సినిమా ఫ్లాప్ అయినప్పుడు మాత్రమే తొందరగా ఓటీటీ స్ట్రీమింగ్ కు ఇచ్చేస్తుంటారు. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లాంటి కంపెనీలకు ఇలా ఎర్లీ యాక్సెస్ కింద ఇచ్చేస్తే, నిర్మాతకు డబ్బులు కాస్త ఎక్కువగా వస్తాయి. కాబట్టి కొంతలోకొంతయినా కోలుకోవచ్చనేది నిర్మాత ఆలోచన.

దీనికి రివర్స్ లో హిట్టయిన సినిమా నిర్మాత అంత తొందరగా తన సినిమాను ఇవ్వడు. కానీ మార్క్ ఆంటోనీ విషయంలో ఇది రివర్స్ అయింది. తమిళ్ లో ఈ సినిమా పెద్ద హిట్టయింది. వంద కోట్ల క్లబ్ లోకి కూడా చేరింది. అయినప్పటికీ విశాల్ ఆగలేదు. రిలీజైన నెల రోజులకే, అంటే ఈనెల 13కే మార్క్ ఆంటోనీ సినిమాను స్ట్రీమింగ్ కు ఇచ్చేశాడు.

తమిళ్ తో పాటు, తెలుగులో ఈ సినిమా మరో 3 రోజుల్లో అందుబాటులోకి రాబోతోంది. తమిళ్ లో పెద్ద హిట్టయినా, ఇలా 4 వారాలకే స్ట్రీమింగ్ కు ఇచ్చేయడం చర్చనీయాంశమైంది.

విశాల్ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగులో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. కామెడీ పేరిట లాజిక్కులు మిస్ చేసి, స్క్రీన్ ప్లే గాలికొదిలేసి, సెకండాఫ్ ను కలగాపులగం చేసేశాడు దర్శకుడు. తెలుగు-తమిళ ఆడియన్స్ మధ్య టేస్ట్ లో ఎంత తేడా ఉందో స్పష్టంగా చూపించింది మార్క్ ఆంటోనీ సినిమా.