యువి..గీతా సంస్థలు కలిసి నిర్మించిన సినిమా పక్కా కమర్షియల్. గోపీచంద్..రాశీఖన్నా లీడ్ పెయిర్. మారుతి దర్శకుడు. పక్కా కమర్షియల్ అయిన లాయర్ గా గోపీచంద్…ఆ వైఖరి నచ్చిని అతని తండ్రిగా సత్యరాజ్ ఢీకొనడం అన్నది స్టోరీ లైన్ గా కనిపిస్తోంది.
ఇందులో లీడ్ క్రిమినల్ గా రావు రమేష్. ట్రయిలర్ ను డిటైల్డ్ గా కట్ చేసారు. ఆ విధంగా స్టోరీ మీద ఓ అంచనా వేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. హీరో కమర్షియాలిటీ, అతన్ని ఇష్టపడుతూనే, మార్చాలనే ప్రయత్నం చేసే హీరోయిన్, కొడుకు మీదే లీగల్ ఫైట్ కు దిగిన తండ్రి ఇదీ కథ అన్నట్లు ట్రయిలర్ కట్ చేసారు.
తొలిసగం అంతా హీరో కమర్షియాలిటీతో ఫన్, హీరోయిన్ ట్రాక్…మలిసగంలో యాక్షన్, ఎమోషన్లను టచ్ చేసినట్లున్నారు మారుతి. ఫన్ అంతా పక్కాగా మారుతి స్టయిల్ సర్కిల్ లోనే వుంది. ‘వంగోపెట్టి..’ అనే మారుతి టైపు డైలాగులు వుండనే వున్నాయి. అలాగే సినిమాను ఫన్, రొమాన్స్, యాక్షన్ అన్నీ మిక్స్ చేసి, ఎక్కడా ఏ కమర్షియల్ పాయింట్ ను వదలకుండా ట్రయ్ చేసినట్లు కనిపిస్తోంది.
కానీ ఇక్కడ సమస్య చిన్నది వుంది. ఏమిటంటే మారుతి స్టయిల్ ఫన్ అన్నది ఒకటే విధంగా సాగుతోంది అనిపించడమే ఆ సమస్య. మారుతి సినిమాల్లో కామెడీ ఇలాగే వుంటుంది అనుకోవడం వరకు ఓకె. అదే కామెడీ వుంటుంది అనుకోవడం వేరు. ఇక్కడ కొంచెం అయినా తేడా చూపించాల్సి వుంటుంది. గోపీచంద్ స్టయిల్ గా అందంగా వున్నాడు. రాశీ ఓకె.